Kia New Version:కియా అప్ గ్రేడ్ మోడల్స్ చూశారా..? అదిరిపోయే ఫీచర్లు..!!

ప్రముఖ వాహన సంస్థ కియా ఇండియా...అధికంగా అమ్ముడవుతున్న రెండు మోడళ్లను మరింత అప్ గ్రేడ్ చేసింది. అవి కియా సెల్టోస్, కియా సోనెట్..

  • Written By:
  • Publish Date - April 11, 2022 / 11:57 AM IST

ప్రముఖ వాహన సంస్థ కియా ఇండియా…అధికంగా అమ్ముడవుతున్న రెండు మోడళ్లను మరింత అప్ గ్రేడ్ చేసింది. అవి కియా సెల్టోస్, కియా సోనెట్…ఈ రెండు మోడళ్లను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ లేటెస్టు మోడల్ సోనెట్ ప్రారంభ ధర రూ. 7.15లక్షలు. సెల్టోస్ ప్రారంభ ధర రూ 10.19లక్షలు. అప్ గ్రేడ్ చేసిన వర్షన్ ప్రకారం..ఇంతవరకు హైఎండ్ వేరియంట్లలో మాత్రమే లభించే ఫీచర్లు ఇప్పుడు…బేస్ వేరియంట్లలో కూడా అందుబాటులోకి వచ్చాయి.

ఇక సేఫ్టీకి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ రెండు కార్లలో సైడ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. దీంతో ఈ రెండింట్లో నాలుగు ఎయిర్ బ్యాగ్ లు, స్టాండర్డ్ గా వినియోగంలోకి వచ్చాయి. కొత్తగా కలర్ ఆప్షన్స్ ను కూడా తెచ్చింది. ఇంపీరియల్ బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక అన్ని కొత్త 2022 మోడల్స్ పై రీడిజైన్ చేసిన బ్రాండ్ బ్యాడ్జ్ ఉంటుది. కియా సెల్టోస్ 13 కొత్త అప్ డేట్స్ ను కలిగి ఉంటుంది. సెల్టోస్ హెచ్ టీకే ప్లస్ వేరియంట్ 1.5 డిజిల్ ఇంజన్…అప్ గ్రేడ్ వెర్షన్ లో ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో రానుంది.

ఇక డీజిల్ మోడల్ కారును అందుబాటులోకి వచ్చిన మొదటి ఐఎంటీ కారుఇదే. సోనెట్ లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్ మెంట్, బ్రేక్ అసిస్ట్, హిల్ అసిస్ట్ కంట్రోల్, హైలైన్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ వంటి భద్రతా ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. సెల్టోస్ లో డీ కట్ స్టీరింగ్ వీల్, ఎస్ యూఎస్ స్కఫ్ ప్లేట్, టెయిల్ గేట్ పై కొత్త సెల్టోస్ లోగో డిజైన్ వంటి మార్పులను చేసింది కంపెనీ. సెల్టోస్ ఎక్స్ లైన్ గురించి చెప్పుకుంటే…ఇది ఇప్పుడు ఇండిగో పారా సీట్లపై ఎక్స్ లైన్ లోగోను కలిగి ఉంటుంది.

ఈ వేరియంట్లో భద్రతా బ్యాగ్ సంఖ్యను పెంచారు. నాలుగ ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్ట్ గా లభించనున్నాయి. ఈ మోడల్ కారుకు పూర్తి సమాచారన్ని అందిస్తుంది. సెమీ లెథెరెట్ సీట్లను ఇప్పుడు హెచ్ టీఈ వేరియంట్ నుంచి అందుతోంది. సెల్టోస్ తరహాలోనే సొనెట్ లోనూ డీ కట్ స్టీరింగ్ వీట్, టెయిల్ గేట్ పై అప్ డేటెడ్ వెర్సన్ లోగోను కూడా ముద్రించింది కంపెనీ.