Site icon HashtagU Telugu

CM Chandrababu : విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ.. కేంద్రమంత్రికి సీఎం సూచన

Cbn

Cbn

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన రంగ అభివృద్ధి, అంతర్జాతీయ కనెక్టివిటీ విస్తరణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బుధవారం ఆయన విజయవాడలోని సచివాలయంలో పౌర విమానయాన శాఖ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ స్థాపనపై పరిశీలించాలంటూ సంబంధిత అధికారులకు సీఎం సూచించారు. ఈ సమీక్షలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ వర్చువల్‌గా పాల్గొన్నారు. రాష్ట్రంలోని విమానాశ్రయాల అభివృద్ధి, దేశీయ, అంతర్జాతీయ కనెక్టివిటీ పెంచే దిశగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Kaleshwaram Project : ‘కాళేశ్వరం’ నిర్మాణమే తప్పు అంటున్న బీజేపీ ఎంపీ

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవన నిర్మాణం ఆకర్షణీయంగా ఉండాలని, డిపార్చర్, అరైవల్ బ్లాక్‌లు, లాంజ్‌లు వంటి కీలక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా డిజైన్లు ఉండాలంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. కూచిపూడి నృత్యం, కొండపల్లి బొమ్మలు, అమరావతి శిల్ప కళ, లేపాక్షి శిల్పాలు వంటివి టెర్మినల్ భవనంలో ప్రతిబింబించాలన్నారు. కడప, రాజమహేంద్రవరం టెర్మినల్ భవనాల నిర్మాణ పురోగతిని మంత్రి రామ్మోహన్ నాయుడు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దగదర్తి, కుప్పం, పలాస (శ్రీకాకుళం) వంటి ప్రాంతాల్లో విమానాశ్రయాల టెక్నికల్ ఫీజిబిలిటీపై పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. అమరావతిలో ప్రతిపాదిత విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తి కాగా, రైట్స్ సంస్థ నివేదిక ఆధారంగా రెండేళ్లలో నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు.

విజయవాడ, విశాఖ విమానాశ్రయాల నుంచి 40% మేర విమాన కార్యకలాపాలు పెరిగాయని మంత్రి వివరించారు. దేశంలోని ప్రధాన నగరాలకు కనెక్టివిటీ పెరిగేలా విమాన సంస్థలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ట్రూజెట్ అక్టోబరు నుంచి విశాఖ కేంద్రంగా కొత్త సర్వీసులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. విజయవాడ-సింగపూర్, తిరుపతి-మస్కట్ మధ్య అంతర్జాతీయ విమాన సర్వీసులు త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. సెప్టెంబర్ తర్వాత సీ ప్లేన్ ఆపరేషన్స్ కూడా ప్రారంభమవుతాయని చెప్పారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై ఖతార్ ఏవియేషన్ ఫండ్ ఆసక్తి చూపుతోందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులో పెట్టుబడులకు వారు ముందుకు వచ్చారని చెప్పారు.

Nithin Thammudu : తమ్ముడు ట్రైలర్ టాక్