దేశం వ్యాప్తంగా రాజ్యాంగం ప్రకారం అనేక చట్టాలున్నాయి. గ్రామంలో, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా వాటి పరిష్కారంకోసం పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, రాజస్థాన్ (Rajasthan) లోని కొన్ని ప్రాంతాల్లో ఖాప్ పంచాయతీ (Khap Panchayat) పెద్దలు చెప్పిందే వేదం. తాజాగా రాజస్థాన్‌లోని చంచోడి గ్రామంలో ఖాప్ పంచాయతీ పెద్దలు వధువు కుటుంబాన్ని వెలివేశారు. దీంతో వారికి గ్రామంలో ప్రజలెవరూ సహకరించకూడదు. అయితే, వీరికి ఎందుకు అంతటి శిక్ష విధించారని ఆరాతీయగా.. వధువును పెళ్లిచేసుకొనే క్రమంలో వరుడు తన గడ్డెంను తొలగించలేదట. గడ్డెం తొలగించనందుకు ఏకంగా వధువు కుటుంబాన్నే ఖాప్ పంచాయతీ పెద్దలు వెలివేశారు.
రాజస్థాన్‌లోని చంచోడీ గ్రామానికి చెందిన అమృత్ సుతార్ ఈ ఏడాది ఏప్రిల్ 22న బాలీకి చెందిన పూజానే యువతిని వివాహం చేసుకున్నాడు. పూజా వృత్తిరిత్యా వెబ్ డెవలపర్. ఉద్యోగం చేస్తూ పుణెలో ఉంటోంది. అయితే, ఈ పెళ్లి ఘనంగా జరిగింది. బంధువులు, చంచోడీ గ్రామం ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రజలుసైతం భారీగా హాజరయ్యారు. వీరి పెళ్లి ఇరు కుటుంబాల్లో సంతోషాన్ని నింపింది. కానీ, రెండు వారాల తరువాత ఖాప్ పంచాయతీ పెద్దలు వధువు కుటుంబానికి విధించిన శిక్షను వరుడు కుటుంబీకులు తెలుసుకొని కంగుతిన్నారు.
పెళ్లి సమయంలో వరుడు గడ్డెంతో వధువుకు తాళికట్టాడని మే5న సుతార్ కుటుంబాన్ని విశ్వకర్మ వంశ సుధార్ సమాజ్‌కి చెందిన ఖాప్ పెద్దలు వధువు కుటుంబాన్ని వెలివేశారు. ఈ విషయంపై వరుడు కుటుంబ సభ్యులు ఖాప్ పంచాయతీ పెద్దలను నిలదీయగా.. మా ఆచారాలు అంతే ఉంటాయని, శిక్ష తొలగించాలంటే వరుడు గడ్డెం తీసేసి ఖాప్ పంచాయతీ పెద్దలకు క్షమాపణలు చెప్పాలని కోరారు. వారి మాటలతో వరుడు కుటుంబ సభ్యులకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే స్థానిక పోలీస్ స్టేసన్ కు వెళ్లి ఖాప్ పంచాయతీ పెద్దలపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సమస్య పరిష్కారంపై దృష్టిసారించారు.
Fever Phone: బాబోయ్ ఫోన్లో అదిరిపోయే ఫీచర్.. ఇకపై ధర్మోమీటర్ మన మొబైల్ లోనే?