Khanapur Constituency : అసలు జాన్సన్‌ నాయక్ ఎస్టీనే కాదు – రేఖానాయక్ సంచలన వ్యాఖ్యలు

జాన్సన్ నాయక్ ఎస్టీనే కాదు.. వాళ్ల ఫాదర్స్ క్రిస్టియన్స్ అంటూ రేఖానాయక్ ఆరోపణలు

  • Written By:
  • Publish Date - August 22, 2023 / 11:46 AM IST

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో అధికార పార్టీ ముందుగానే అభ్యర్థుల ప్రకటన చేసి ఎన్నికల ప్రచారానికి సిద్ధం చేసింది. సోమవారం మంచి ముహూర్తం ఉన్నందున పార్టీ అధినేత , సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో మొత్తం 115 అభ్యర్థుల తాలూకా పేర్లు , వారు పోటీ చేయబోయే స్థానాలను ప్రకటించారు. అయితే నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల కు మాత్రం అధినేత షాక్ ఇచ్చారు. వారి స్థానాలలో కొత్త వారికీ అవకాశం ఇచ్చారు. దీంతో ఆ నలుగురితో పాటు..ఈసారి టికెట్ నాకే అని నమ్మకం తో ఉన్న వారు అధిష్టానం ఫై ఆగ్రహం గా ఉన్నారు. కొంతమంది పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు.

ఖానాపూర్‌ నియోజకవర్గం (Khanapur Constituency) అసెంబ్లీ అభ్యర్థిగా భూక్యా జాన్సన్‌ రాథోడ్‌ నాయక్‌ (Bhukya Johnson Rathod Naik)కు సీఎం కేసీఆర్‌ (CM KCR) టికెట్‌ కేటాయించడంతో..అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ (MLA Rekha Nayak) పార్టీ అధిష్టానం ఫై గుర్రుగా ఉంది. పార్టీ అభ్యర్థుల లిస్ట్ లో తన పేరు రాకపోయేసరికి ఆమె భర్త..సోమవారం సాయంత్రమే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొద్ది రోజుల్లో రేఖానాయక్ సైతం కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో ఈమె మీడియా తో మాట్లాడుతూ..జాన్సన్ నాయక్ అసలు ఎస్టీనే కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. జాన్సన్ నాయక్ ఎస్టీనే కాదు.. వాళ్ల ఫాదర్స్ క్రిస్టియన్స్ అంటూ రేఖానాయక్ ఆరోపణలు చేశారు. ఫేక్ సర్ఠిఫికెట్ తెచ్చి ఎస్టీ అంటున్నారు. ఆధారాలతో నిరూపిస్తా…నేనే ఇక్కడి నుండే పోటీ చేస్తా..గెలిచి తీరుతా అంటూ సవాల్ చేసారు. మార్టీ మారడంపై నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు…రాత్రి పగలు అని చూడకుండా ప్రజల్లో ఉన్నానని పేర్కొన్నారు.

మరోపక్క బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా భూక్యా జాన్సన్‌ రాథోడ్‌ నాయక్‌ను సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో మండల కేంద్రంలో సోమవారం బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, జాన్సన్‌ నాయక్‌ అభిమానులు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి, నృత్యాలు చేసి సంబురాలు నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో బైక్‌ ర్యాలీని తీశారు.

Read Also : PM KISAN – 3000 Hike : రైతులకు గుడ్ న్యూస్.. “పీఎం-కిసాన్‌” సాయం రూ.3000 పెంపు ?