KGF 2 box office: కేజీఎఫ్ కలెక్షన్ల తుఫాన్..1000 కోట్లు వసూళ్లు!

బాక్సాఫీస్ రికార్డులను కేజీఎఫ్ 2  (KGF 2) బద్దలు కొట్టింది.

  • Written By:
  • Updated On - May 1, 2022 / 05:56 PM IST

బాక్సాఫీస్ రికార్డులను కేజీఎఫ్ 2  (KGF 2) బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. విడుదలైన 16 రోజుల్లోనే దాదాపు రూ.1000 కోట్ల కలెక్లన్లు సాధించి సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా లెవెల్లో ఇప్పటివరకు రూ. 1000 కోట్లు వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది.ఇంతకుముందు దంగల్, బాహుబలి 2,ఆర్ఆర్ఆర్ సినిమాలు ఈ రికార్డును సాధించాయి. కేజీఎఫ్ 2 మూవీలో సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలలో నటించారు. ఇక కేజీఎఫ్ 2 కంటే కేజీఎఫ్ 3 అంతకు మించి ఉండబోతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యశ్ చెప్పిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ కు భయం..

మూడో శుక్ర‌వారం కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ పై కేజీఎఫ్ 2 పైచేయి కొన‌సాగుతూ ఉంది. కేజీఎఫ్ 2 ధాటికి భ‌య‌ప‌డి ఆ సినిమాతో పాటు విడుద‌ల‌కు బాలీవుడ్ సినిమాలు వెనుకంజ వేశాయి. ఒక వారం అంతా కేజీఎఫ్ 2 కే వ‌దిలేశాయి. బాలీవుడ్  కు సంబంధించి ఈ శుక్ర‌వారం అజ‌య్ దేవ‌గ‌ణ్ హీరోగా న‌టించిన ర‌న్ వే 34, హీరో ప‌త్నీ 2 వంటి చెప్పుకోద‌గిన సినిమాలు విడుద‌ల అయ్యాయి. అయితే అజ‌య్ దేవ‌గ‌ణ్ సినిమా విడుద‌లైన తొలి రోజున మూడు కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను మాత్ర‌మే సాధించింది. ఇదే స‌మ‌యంలో కేజీఎఫ్-2 నాలుగు కోట్ల రూపాయ‌ల‌ను సాధించుకుంది.