నటి సన్నీ లియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్, ఆమె ఉద్యోగిపై నమోదైన చీటింగ్ కేసు క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై కేరళ హైకోర్టు బుధవారం స్టే విధించింది. తమపై ఉన్న కేసును రద్దు చేయాలని కోరుతూ సన్నీ లియోన్ చేసిన పిటిషన్‌పై జస్టిస్ జియాద్ రెహమాన్ ఏఏ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషన్ తదుపరి విచారణ తేదీ వరకు క్రిమినల్ ప్రొసీడింగ్‌లపై కోర్టు స్టే విధించింది. లియోన్, ఆమె భర్త, ఆమె ఉద్యోగి కేరళకు చెందిన ఈవెంట్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన నేరంలో నిందితులుగా ఉన్నారు.
కేరళలోని ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఈవెంట్ మేనేజర్ శియాస్ కుంజు మహమ్మద్ దీన్ని దాఖలు చేశారు. ఈవెంట్‌లో ప్రదర్శన చేయడానికి సన్నీ లియోన్‌కు లక్షల రూపాయలు చెల్లించినప్పటికీ, నటి రాకుండా మోసం చేసిందని ఫిర్యాదుదారు ఆరోపించారు. దీంతో సన్నీలియోన్, డానియల్ వెబెర్, వారి ఉద్యోగిపై సెక్షన్ 406, సెక్షన్ 420, సెక్షన్ 34 కింద అభియోగాలు నమోదు చేశారు. ఇవన్నీ అసత్యాలని సన్నీ లియోన్ తెలిపింది.
తాను, తన భర్త, తన ఉద్యోగికి దీంతో ఎలాంటి సంబంధం లేదని, ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవని పిటిషన్ లో తెలియజేసింది. ఫిర్యాదుదారుకు ఎలాంటి నష్టం జరగలేదని, అయితే ఈ కేసు వల్ల తమ జీవితాలు ప్రతికూలంగా ప్రభావితమవుతున్నాయని పిటిషన్‌లో పేర్కొంది.సాక్ష్యాధారాల కోసం జూలై 2022లో మేజిస్ట్రేట్ కోర్టు కొట్టివేసిన ఆరోపణలతో ఫిర్యాదుదారుడు సివిల్ దావాను కూడా దాఖలు చేశారని కూడా పిటిషన్‌లో పేర్కొంది. కావున తమపై విచారణను రద్దు చేయాలని వారు కోరారు.