KCR: కేసీఆర్ (కేశవ చంద్ర రమవత్) సినిమా హీరో,నిర్మాత రాకింగ్ రాకేష్ నిర్మించిన తెలంగాణ తేజం పాటను నంది నగర్ లోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్,యాంకర్ జోర్ధార్ సుజాత,సింగర్ విహ,గీత రచయిత సంజయ్ మహేష్ లు , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ దీవకొండ దామొదర్ రావు, ప్రణాలిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్,ఎమ్మెల్సీ,మాజీ స్పీకర్ మధుసుధన చారి ,ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్,బీఆర్ఎస్ నాయకులు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,రాఘవ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా నగర్ నుంచి బయలుదేరిన ఓ మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన రాకేశ్ ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈరోజు కేసీఆర్ చేతుల మీదుగా సినిమా పాటను రిలీజ్ చేయించుకున్నాను. ఈ స్థాయికి వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. నేను ఈ సినిమా చేద్దామని అనుకున్నప్పుడు చాలా మంది వెనకాల ఉంటామని మాట ఇచ్చారని అన్నారు.