Lashkar Bonalu: నగరంలో అంగరంగ వైభవంగా లష్కర్ బోనాలు

తెలంగాణలో బోనాలు సంబరాలు మొదలయ్యాయి. తెలంగాణ విశిష్ట సంస్కృతికి ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

Lashkar Bonalu: తెలంగాణలో బోనాలు సంబరాలు మొదలయ్యాయి. తెలంగాణ విశిష్ట సంస్కృతికి ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు, తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి దేవుడికి మొదటి ‘బోనం’ సమర్పించారు. ఇదే వేడుకల్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఇతర నాయకులు పూజలు చేశారు.

Read More: Cluster Bombs Explained : క్లస్టర్ బాంబులపై దుమారం.. ఎందుకు ? ఏమిటవి ?