Site icon HashtagU Telugu

MLC Kavitha: నూతన కార్యాలయం ఓపెన్ చేసిన ఎమ్మెల్సీ కవిత

Kavitha

Kavitha

MLC Kavitha: తెలంగాణలో రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారిన విషయం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్‌కు ఇటీవల రాసిన లేఖ. ఈ లేఖ బహిర్గతం అయ్యాక రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో కవిత రాజకీయంగా మరో కీలక అడుగు వేశారు. తన కార్యకలాపాలకు మరింత స్పష్టత ఇవ్వడం కోసం తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇందిరాపార్క్ సమీపంలో ప్రస్తుతం ఉన్న తెలంగాణ జాగృతి పాత కార్యాలయాన్ని మూసివేస్తూ, హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసానికి పక్కనే ఉన్న భవనంలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యాలయ ప్రారంభోత్సవం ఈరోజు (జూన్ 1) సాయంత్రం 4 గంటలకు జరగనుంది. ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కొత్త కార్యాలయం ఏర్పాటుతో కవిత తన రాజకీయ వ్యూహాన్ని మరింత దృఢంగా ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పంలో ఉన్నట్టు తెలుస్తోంది.

Ration Rice Distribution: ఏపీ కూటమి ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు నోటీసులు

ఈ కార్యాలయం ప్రారంభం అనంతరం, కవిత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద జరగబోయే ధర్నా, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై వచ్చిన కమిషన్ నోటీసులపై కేసీఆర్‌కు మద్దతుగా తెలంగాణ జాగృతి తరఫున ఆమె స్పందించే అవకాశముంది. ఇది పూర్తిగా ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేందుకు చేపడుతున్న కార్యక్రమంగా చెబుతున్నారు జాగృతి నేతలు. ఈ ధర్నా ద్వారా కవిత బీఆర్ఎస్‌కు ప్రజల్లో మళ్లీ గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా తన రాజకీయ భవిష్యత్తు గురించి కొనసాగుతున్న ఊహాగానాల మధ్య, తన స్థానం మరింత బలంగా చాటేందుకు ఈ కార్యాలయం కేంద్ర బిందువుగా మారబోతోంది.

మరోవైపు, తెలంగాణ జాగృతికి ఇప్పుడు స్పష్టమైన కార్యాచరణ లక్ష్యం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమం జ్ఞాపకాలను, బీఆర్‌ఎస్ చరిత్రను, కేసీఆర్ నేతృత్వానికి మద్దతుగా ఉన్న ప్రజాస్వామ్య శక్తులను సమీకరించేందుకు ఇది ప్రధాన వేదికగా మారనుంది. ఇటీవల లేఖ, ఇప్పుడు కార్యాలయ ప్రారంభం… ఇవన్నీ కలిపి చూస్తే కవిత రాబోయే రోజుల్లో మరింత యాక్టివ్‌గా రాజకీయ రంగంలో కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకుల అంచనా.

100 Cr Offer : రూ.100 కోట్ల ఆఫర్ ను రిజక్ట్ చేసిన నయన్‌తార..ఎందుకంటే..!!