Site icon HashtagU Telugu

MLC Kavitha: కేసీఆర్ పట్ల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు: ఎమ్మెల్సీ కవిత

Kavithabrs

Kavithabrs

MLC Kavitha: హైదరాబాద్: క్లిష్ట సమయంలో దేశ నలుమూలల నుంచి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పట్ల ప్రేమాభిమానాలు కనబర్చినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కేసీఆర్ నంది నగర్ లోని తన నివాసానికి చేరుకున్న నేపథ్యంలో కవిత “ఎక్స్”లో పోస్ట్ చేశారు.

తుంటి మార్పడి శస్త్రచికిత్స విజయవంతమై యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డాశ్చార్జ్ అయ్యారని తెలిపారు. కేసీఆర్ కి చికిత్స అందించిన డాక్టర్లు, నర్సులతో పాటు అన్ని విధాలా సహకరించిన ఆస్పత్రి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ క్లిష్టమైన సమయంలో దేశ నలుమూలల నుంచి లభించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞులమని పేర్కొన్నారు.

Also Read: CM Jagan: ఏపీలో ఎన్నికలు ముందే జరగవచ్చు: సీఎం జగన్