MLC Kavitha: గూడెం మహిపాల్ రెడ్డిని పరామర్శించిన కవిత

కుమారుడిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు.

Published By: HashtagU Telugu Desk
MLC Kavitha

New Web Story Copy 2023 07 30t171354.744

MLC Kavitha: కుమారుడిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. రెండు రోజుల క్రితం గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గుండెపోటుకు గురై మరణించాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విష్ణువర్ధన్ రెడ్డికి ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న సమయంలో గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన మృతి చెందారు. అయితే రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా కవిత మహిపాల్ రెడ్డిని పరామర్శించడం కుదరలేదు. ఈ రోజు ఆదివారం ఆమె ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించింది. పుత్రశోకంతో కుమిలిపోతున్న మహిపాల్ రెడ్డిని ఆమె ఓదార్చారు. విష్ణువర్ధన్ రెడ్డి ఆకస్మిక మరణం బాధ కలిగించిందని అన్నారు, తండ్రి రాజకీయ వారసుడిగా ఎదుగుతున్న టైములో ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు కవిత ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Also Read: AP Politics: సినిమాలో పొలిటికల్ డైలాగ్స్.. పాలిటిక్స్ లో సినిమా డైలాగ్స్

  Last Updated: 30 Jul 2023, 05:15 PM IST