Karnataka: కర్ణాటకలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వారానికి రెండుసార్లు గుడ్లు, అరటిపండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టబోతున్నట్టు కర్ణాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప తెలిపారు. విద్యార్థులకు కోడిగుడ్లు, అరటిపండ్లు పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 18 నుంచి ప్రారంభిస్తామని, ముందుగా మాండ్య జిల్లాలో ప్రారంభిస్తామని తెలిపారు. గతంలో ఈ పథకాన్ని 8వ తరగతి వరకు పొడిగించాలని అనుకున్నారు. ఇప్పుడు ఈ పథకాన్ని 10వ తరగతి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు.
Also Read: WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై చాట్ మరింత భద్రం?