Karnataka Crime: కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగి ప్రతిమ హత్యకేసులో నిందితుడు అరెస్ట్

కర్నాటకలో మహిళా ప్రభుత్వ ఉద్యోగి కేఎస్‌ ప్రతిమ హత్య కేసులో మాజీ కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ అనే వ్యక్తి కర్ణాటక ప్రభుత్వంలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

Karnataka Crime: కర్నాటకలో మహిళా ప్రభుత్వ ఉద్యోగి కేఎస్‌ ప్రతిమ హత్య కేసులో మాజీ కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ అనే వ్యక్తి కర్ణాటక ప్రభుత్వంలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. 10 రోజుల క్రితం కేఎస్‌ ప్రతిమ డ్రైవర్ కిరణ్ పై ఫైర్ అయినట్లు తెలుస్తోంది. దీంతో కోపోద్రిక్తుడైన కిరణ్ పథకం వేసి హత్య చేశాడు. ఈ విషయాన్ని అంగీకరించి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.హత్య అనంతరం కిరణ్ బెంగళూరుకు 200 కిలోమీటర్ల దూరంలోని సామరాజనగర్‌కు పారిపోయాడు. పోలీసులు ప్రత్యేక బృందంతో సామ్నాజానగర్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రతిమ (45) కర్ణాటక ప్రభుత్వ గనులు మరియు భూగర్భ శాస్త్ర విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. రెండ్రోజుల క్రితం ఆమె ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళింది. రాత్రి 8 గంటల తర్వాత ప్రతిమకు ఆమె సోదరుడు ఫోన్‌ చేయగా ప్రతిమ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మరుసటి రోజు తన సోదరి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ప్రతిమ ఉరేసుకుని శవమై కనిపించింది. అనంతరం పోలీసు శాఖకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నిందితుడిని సోమవారం అరెస్టు చేశారు. హత్య జరిగిన 48 గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: Mizoram, Chhattisgarh Voting : రేపే ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలో పోలింగ్..సర్వం సిద్ధం చేసిన అధికారులు