Bengal Train Accident: బెంగాల్ రైలు ప్రమాదంలో చిన్నారి మృతి

కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఆరేళ్ళ స్నేహ మొండల్ సోమవారం సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ & హాస్పిటల్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరింది.

Bengal Train Accident: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్-గూడ్స్ రైలు ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 11కి చేరుకుందని అధికారులు తెలిపారు. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఆరేళ్ళ స్నేహ మొండల్ సోమవారం సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ & హాస్పిటల్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరింది. అప్పటి నుంచి వైద్యులు ఆమె ప్రాణాలను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. అయితే మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఆమె మరణించడంతో ఈ లెక్కన వారి ప్రయత్నాలన్నీ ఫలించలేదు.

బాలిక కాళ్లకు, కాలేయానికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తుంది. దీంతో డాక్టర్లు ప్రయత్నించినప్పటికీ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా ప్రమాదంలో 37 మంది సోమవారం ఆసుపత్రిలో చేరారని, వారిలో ఇద్దరు ప్రాథమిక చికిత్స తర్వాత ఇంటికి వెళ్లారని డాక్టర్లు సమాచారం ఇచ్చారు.

సిలిగురిలోని న్యూ జల్పాయ్‌గురి స్టేషన్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని రంగపాణి సమీపంలో సోమవారం ఉదయం గూడ్స్ రైలు ఆగి ఉన్న ఉన్న కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది.

Also Read: Telangana Power : కేసీఆర్ తొందరపాటు వల్ల రూ.81వేల కోట్ల అప్పు – కోదండరాం హాట్ కామెంట్స్