Site icon HashtagU Telugu

Kakani Govardhan Reddy : లైంగిక వేధింపులు.. వైసీపీ మాజీ మంత్రిపై కేసు నమోదు

Kakani Govardhna Reddy

Kakani Govardhna Reddy

Kakani Govardhan Reddy : ఏదో చేయబోతే ఇంకేదో అయిందనే సమోత మనం వినే ఉంటాం.. అలాంటి ఈ నేత విషయంలో నిజం అనిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డిపై వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలానికి చెందిన ఓ వ్యక్తి డిసెంబర్ 27న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

#GetWellSoon : విశాల్ త్వరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్ పోస్టులు

మహిళా ఫిర్యాదు, శేషయ్యపై న్యాయపరమైన చర్యలు:
లైంగిక వేధింపుల ఆరోపణలు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మంగళ వెంకట శేషయ్య, కాకాణి గోవర్థన్‌ రెడ్డికి సన్నిహితుడు, వెంకటాచలం మండల మాజీ జెడ్పీటీసీ సభ్యుడిని ఉన్నారు. ఫిర్యాదు ప్రకారం, శేషయ్య మహిళను లైంగికంగా వేధించాడని ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో శేషయ్యను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. దీంతో కోర్టు అతనికి రిమాండ్‌ విధించింది.

కాకాణి గోవర్థన్‌ రెడ్డి ఆరోపణలు:
ఈ కేసుకు సంబంధించి వైసీపీ నేత కాకాణి గోవర్థన్‌ రెడ్డి తీవ్ర ప్రతిస్పందన వ్యక్తం చేశారు. ఫిర్యాదులు రాజకీయ నైపథ్యంలో వచ్చాయని, ఇవి ప్రతిపక్ష టీడీపీ కుట్రగా ఆరోపించారు. ప్రత్యేకంగా, వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటాచలం సీఐ సుబ్బారావు ఖాకీ దుస్తులు తీసేసి పచ్చ చొక్కా వేసుకుని చంద్రబాబు, లోకేశ్ చుట్టూ తిరగాల్సిందేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దీంతో.. కాకాణి గోవర్థన్‌ రెడ్డిపై పోలీసు అధికారులను బెదిరించడం, దర్యాప్తు ప్రక్రియను అడ్డుకోవడం వంటి ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదు దారుడు, కాకాణి పోలీసులు విచారణను సజావుగా ముందుకు సాగకుండా, దాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. ఈ కేసు వెలుగులోకి రావడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపింది. గోవర్ధన్ రెడ్డి చేసిన ఆరోపణలు, పోలీసులపై చేసిన వ్యాఖ్యలు మరోసారి ఏవైసీపీ-టీడీపీ మధ్య విభేదాలను తెరమీదకు తెచ్చాయి.

ఘటనపై ప్రజలు, రాజకీయ విశ్లేషకులు తీవ్ర చర్చిస్తున్నారు. ముఖ్యంగా, మహిళా భద్రత, రాజకీయాల్లో నైతికత వంటి అంశాలపై కొత్తగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. నిజ నిర్ధారణ కోసం అధికార ప్రతిపక్షాలు చట్టపరమైన మార్గాలను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Voters List : తెలంగాణలో 3.35 కోట్ల ఓటర్లు.. ఎన్నికల సంఘం జాబితా విడుదల

Exit mobile version