Site icon HashtagU Telugu

Kaithal Accident: పండ‌గ‌పూట విషాదం.. 8 మంది దుర్మ‌ర‌ణం

Kaithal Accident

Kaithal Accident

Kaithal Accident: హర్యానాలోని కైతాల్ జిల్లాలో దసరా రోజున కారు అదుపు తప్పి కాలువలో పడిపోవడంతో పెను ప్రమాదం (Kaithal Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఏం జ‌రిగిందంటే..?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ‌నివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. బాబా లాడన జాతరకు కుటుంబ సభ్యులు వెళుతుండగా ముండ్రి సమీపంలో కాల్వలో కారు పడిపోవడంతో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు తీవ్రగాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Also Read: Cyber Attacks : ఇరాన్‌ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ సైబర్ దాడులతో కలకలం

రెస్క్యూ టీమ్‌తో కాల్వలోంచి మృతదేహాలను బయటకు తీసే పని కొనసాగుతోందని డీఎస్పీ లలిత్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 8 మంది మృతదేహాలు లభ్యం కాగా, 1 వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తామని, కారులో సాంకేతిక లోపం ఏర్పడిందా లేదా డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల బంధువులకు సమాచారం అందించి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు

ప్రమాద విషయాన్ని డీఎస్పీ లలిత్ కుమార్ ధృవీకరించారు. డ్రైవర్‌ ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు. మరోవైపు మరో 8 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. అదే సమయంలో ఇంకొక‌ బాలిక మృతదేహం లభ్యం కాలేదు. డైవర్లు ఆమె కోసం అన్వేషణలో నిమగ్నమై ఉన్నారు. మృతదేహాన్ని వెలికి తీయనున్నారు. హర్యానా పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.