Site icon HashtagU Telugu

Venkaiah Naidu: చట్టాలను న్యాయవ్యవస్థ చేయలేదు: వెంకయ్య నాయుడు

Venkaiah Naidu

New Web Story Copy (98)

Venkaiah Naidu: ఒక చట్టం రూపకల్పన చేయాలంటే దాని వెనుక ఎంతో విస్తృత మేధోమథనం అనేకరకాల చర్చోపచర్చలు జరుగుతాయి. చట్టం అమలు కావాలి అంటే అసెంబ్లీలో విస్తృత చర్చ, నిపుణులతో సంప్రదింపులు జరిపి అప్పుడు చట్టాన్ని అమలు పరుస్తారు. మన దేశంలో ఏ చట్టంలోనైనా శాసనసభ ఆధిపత్యం కనపడుతుంది. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న నేతలు చట్టాన్ని రూపకల్పన చేయడం జరుగుతుంది. ఒక చట్టాన్ని ప్రజల మీద రుద్దడం అనేది సమాజానికే నష్టం. కానీ వాస్తవిక దృష్టితో చట్టాలు రూప కల్పన చేస్తే అది సమాజానికి ఎంతో మేలు చేస్తుంది భావితరాలకు ఉపయోగపడుతుంది.

చట్టాల రూపకల్పనలో శాసనసభ ఆధిపత్యాన్ని సమర్థించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. నేషనల్ లెజిస్లేటర్స్ కాన్ఫరెన్స్‌ను ఉద్దేశించి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. రాజ్యాంగం కార్యనిర్వాహక, శాసనసభ మరియు న్యాయవ్యవస్థకు సంబంధించిన కార్యకలాపాలను స్పష్టంగా నిర్వచిస్తుందని చెప్పారు. ఈ ప్రక్రియలో న్యాయవ్యవస్థ పాత్ర లేదని నాయుడు నొక్కి చెప్పారు. శాసన అధికారాలు శాసన సంస్థలకు మాత్రమే ఉన్నాయని వెంకయ్య అన్నారు. అయితే చట్టం రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా అనేది న్యాయస్థానాలు నిర్ణయించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మన దేశంలో న్యాయస్థానాలు చట్టం చేయలేవు. న్యాయవ్యవస్థ చట్టం రూపకల్పనలో జోక్యం చేసుకోదని ఆయన అన్నారు.

వెంకయ్య నాయుడు ఇంకా మాట్లాడుతూ.. ఒక చట్టాన్ని శాసనసభ నిర్ణయిస్తుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ అమలు చేస్తుంది. ఈ విషయంలో ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కోర్టుకు వెళ్లవచ్చు. ఈ విషయంలో న్యాయవ్యవస్థ డైనమిక్‌గా ఉండాలని, చట్టానికి సంబంధించిన సమస్యలను న్యాయవ్యవస్థ వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు వెంకయ్య నాయుడు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్‌లను ఎంపిక చేసేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో రాజ్యాంగబద్ధంగా అధికారాల విభజనపై వివాదం తలెత్తిన నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు.

Read More: Pushpa2 Video: లారీల ఛేజింగ్ సీన్స్.. పుష్ప2 వీడియో వైరల్!