Site icon HashtagU Telugu

Jubilee Hills Gang Rape: జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో వెలుగులోకి వచ్చిన మరిన్ని కొత్త విషయాలు..?

Mo47c7ya

Mo47c7ya

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఎక్కడ చూసినా కూడా ఇదే ఘటన గురించి మారుమోగుతోంది. ఈ ఘటన పై తెలంగాణ స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఫోకస్ అవుతోంది. అయితే ఈ కేసు వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ గ్యాంగ్ రేప్ ఘటనలో ప్రభుత్వ సంస్థకు చెందిన ఒక చైర్మన్ కొడుకు ఉన్నట్లు మొదటి నుంచి ప్రచారం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

తాజాగా అందిన సమాచారం ప్రకారం అత్యాచారం తర్వాత నిందితులు మొయినాబాద్ కు చేరుకున్నారు. అనంతరం ఒక రాజకీయ నేత కు చెందిన ఫామ్ హౌస్ లో ఆశ్రయం పొందారు. అనంతరం ఫామ్ హౌస్ లో మద్యం సేవించారు. ఆ తర్వాత ఫాంహౌస్ నుంచి నిందితులు రెండు వేర్వేరు చోట్ల కు పరారీ అయ్యారు. ఇక వారి కారును ఫాంహౌస్ వెనుక దాచిపెట్టారు…