CSIR-UGC-NET: ఎన్టీఏ ఎందుకు విఫలమవుతోంది? సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ పరీక్ష కూడా వాయిదా!

  • Written By:
  • Updated On - June 21, 2024 / 11:36 PM IST

CSIR-UGC-NET: దేశంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నాలుగోసారి విఫలమైంది. నీట్, ఎన్‌సీఈటీ, యూజీసీ నెట్ తర్వాత మరో పరీక్ష వాయిదా పడింది. సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ (CSIR-UGC-NET) పరీక్ష జూన్ 25 నుంచి 27 మధ్య జరగాల్సి ఉంది. ఇంతకు ముందు కూడా సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ వాయిదా పడింది. గతంలో నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసు వెలుగులోకి రావడంతో పలువురు నిందితులను అరెస్టు చేశారు. ఆ తర్వాత యూజీసీ నెట్ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు తేలింది.

పరీక్ష ఎందుకు వాయిదా పడిందో తెలుసా..?

సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ఈ నెల 25 నుంచి 27 వరకు జరగాల్సి ఉంది. అంతకుముందు పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఎన్టీఏ తెలియజేసింది. వనరుల కొరత కారణంగా సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏజెన్సీ తెలిపింది. ఈ పరీక్షల సవరించిన షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్ ద్వారా త్వరలో తెలియజేస్తామని అధికారులు చెప్పారు.

NTA అభ్యర్థులకు ఈ సలహా ఇచ్చింది

దీనికి సంబంధించి, పరీక్షకు సంబంధించిన అప్‌డేట్‌లను తెలుసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే వారు NTA హెల్ప్‌డెస్క్ నంబర్ 011-40759000కి కాల్ చేయవచ్చు.

Also Read: Rajkot Fire: రాజ్‌కోట్ గేమింగ్ జోన్ ప్రమాదంపై సిట్ నివేదిక

UGC NET పరీక్ష ఎందుకు రద్దు అంటే..?

దీనికి ముందు జూన్ 18 న దేశవ్యాప్తంగా యూజీసీ నెట్‌ పరీక్ష నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. NTA పరీక్షను OMR విధానంలో రెండు షిఫ్టులలో నిర్వహించింది. ఒక రోజు తర్వాత అంటే జూన్ 19న విద్యా మంత్రిత్వ శాఖ ఈ పరీక్షను రద్దు చేసింది. యూజీసీ నెట్ పరీక్షలో కొన్ని అవకతవకలు జరిగినట్లు తేలింది.

We’re now on WhatsApp : Click to Join

NCET పరీక్ష కూడా రద్దు చేశారు

అంతకుముందు NTA నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (NCET) 2024 పరీక్షను కూడా రద్దు చేసింది. సాంకేతిక కారణాల వల్ల ఈ పరీక్షను రద్దు చేసినట్లు ఏజెన్సీ తెలిపింది.

నీట్‌ పరీక్ష పేపర్ కూడా లీక్ అయింది

యూజీసీ నెట్ పరీక్ష రద్దుకు కొద్ది రోజుల ముందు నీట్ పరీక్ష పేపర్ లీక్ అయింది. దీనిపై దేశ వ్యాప్తంగా రాజకీయం రసవత్తరంగా మారింది. అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో ఈ సమస్యపై ప్రశ్నలు అడిగే అవకాశముంది.