2007లో టీ20 ప్రపంచకప్‌ను భారత్‌కు అందించిన ఫాస్ట్ బౌలర్ జోగిందర్ శర్మ రిటైరయ్యాడు. అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ (Retirement) ప్రకటిస్తున్నట్లు శుక్రవారం ట్వీట్ చేశాడు. 39 ఏళ్ల జోగిందర్ చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అతను 2007లోనే చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అప్పుడు టీ20 ప్రపంచకప్‌లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి జోగిందర్ ప్రధాన అస్త్రాలలో ఒకటి. జోగిందర్ బీసీసీఐ కార్యదర్శి జై షాకు లేఖ రాస్తూ రిటైర్మెంట్ ప్రకటించాడు.
Announced retirement from cricket Thanks to each and everyone for your love and support 🙏❤️👍👍 pic.twitter.com/A2G9JJd515
— Joginder Sharma 🇮🇳 (@MJoginderSharma) February 3, 2023
2007లో పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో చివరి ఓవర్ బౌలింగ్ చేసిన భారత ఆల్ రౌండర్ జోగిందర్ శర్మ అన్ని రకాల క్రికెట్‌ల నుంచి రిటైరయ్యాడు. 39 ఏళ్ల జోగిందర్ 4 వన్డేలు, 4 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2007 చివరి ఓవర్‌లో 13 పరుగులు డిఫెండ్ చేయడం ద్వారా భారత్‌కు విజయాన్ని అందించాడు.
Also Read: PM Modi: ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్ కు ప్రధాని మోదీ.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ కూడా..!
మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో 2007లో టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో ఆటగాడు జోగిందర్ శర్మ. శుక్రవారం ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. బీసీసీఐ, హర్యానా క్రికెట్ అసోసియేషన్, ఐసీసీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. తన అభిమానులు, మెంటర్లు, కోచ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే మ్యాచ్‌లకు టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు.
2007 అక్టోబర్‌లోనే హర్యానా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన జోగిందర్ శర్మ, 2016-17 సీజన్ వరకూ రంజీ మ్యాచుల్లో ఆడాడు. 2012 వరకూ చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన జోగిందర్ శర్మ, సీఎస్‌కేకి రెండు ఐపీఎల్ టైటిల్స్ అందించాడు. 2013 వేలంలో అమ్ముడుపోలేదు.