Site icon HashtagU Telugu

Jhanvi and Akhil: అఖిల్ తో జాన్వీ రొమాన్స్.. టాలీవుడ్ లో మరో ఛాన్స్?

Janhvy

Janhvy

బాలీవుడ్ బ్యూటీ జాన్వీకి (Jhanvi) అవకాశాలు క్యూ కడుతున్నాయి. అవి కూడా క్రేజీ కాంబినేషన్లవి కావడంతో టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారేలా ఉంది. రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కబోయే స్పోర్ట్స్ డ్రామాకు తననే ఫస్ట్ ఆప్షన్ గా పెట్టుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. తారక్ తో షూటింగ్ కు మొదలు జరిగిన ఫోటో షూట్ పిక్స్ చూసి సంతృప్తి చెందిన ఆర్సి 16 టీమ్ అధిక శాతం పాజిటివ్ గా స్పందించారట.

ఏజెంట్ డిజాస్టర్ తో విశ్రాంతి కోసం దుబాయ్ వెళ్ళిపోయిన అఖిల్ (Akhil) తర్వాత యువి క్రియేషన్స్ తో చేతులు కలపబోతున్నాడు. డెబ్యూ దర్శకుడి కథ స్క్రిప్ట్ ఎప్పుడో ఓకే అయ్యాయి. ఇప్పుడు మరోసారి రీ చెక్ చేసుకునే అవకాశం ఉంది కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇప్పుడే చెప్పలేం. ఇందులో కూడా జాన్వీనే నిర్మాతలు రికమండ్ చేస్తున్నట్టు వినికిడి. ఇలా ఇంత మంచి ఛాన్సులు వస్తే ఎవరు మాత్రం వదులుంటారు. అయితే ఇదంతా అఫీషియల్ కావడానికి నెలల సమయం పడుతుంది. తారక్ సినిమా ఈ ఏడాది చివర్లో పూర్తవుతుంది కనక ఈలోగా జాన్వీ వేరే కమిట్మెంట్లు ప్లాన్ చేసుకోవచ్చు.

Exit mobile version