Site icon HashtagU Telugu

Jeevan Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం తప్ప పనులు చేయలేదు

MLC Elections

MLC Elections

Jeevan Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు. తరచుగా మీడియా ముందుకొచ్చి నేతలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బిఆర్‌ఎస్‌కు ఇంకా జ్ఞానోదయం కలగలేదని మండిపడ్డారు. మిషన్ భగీరథ పెద్ద కుంభకోణం అని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. బిఆర్‌ఎస్ ప్రచారం చేసుకోవడం తప్ప ఎక్కడా అభివృద్ధి చేయలేదని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆత్మస్తుతి, పరనింద నుంచి బయటకు రావాలని లేకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఓటమి ఖాయమని విమర్శించారు.

బిఆర్ఎస్ మిత్రపక్షంగా భావించే రాజకీయ పార్టీ పక్కలో బల్లెంలా వేచిచూస్తోందని చురకలంటించారు. ఇప్పటికైనా తెలుసుకొని వాస్తవాలకు అనుగుణంగా వ్యవహరించి ప్రతిపక్ష స్థానంలో నిలబెట్టుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికలలో తప్పుడు ప్రచారంతోనే బిఆర్ఎస్ కు ఓట్లు పడ్డాయన్నారు.ఓటమిని అంగీకరించే పరిస్థితిలో కేటీఆర్ లేడని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మిషన్ భగీరథ పెద్ద స్కాం అని ఆరోపించారు. కాళేశ్వరం రీ డిజైన్ పెద్ద బోగస్ అని.. కేవలం కమీషన్ ల కోసం రీ డిజైన్ చేశార‌ని మండిప‌డ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ ను ఎస్సీ డెవల్మెంట్ ఫండ్ గా మార్చి నిధులను మళ్ళించిందని.. నిధుల దారి మళ్ళింపును చర్చకు రాకుండా చేసేందుకు దళిత బంధును తెరపైకి తెచ్చారని ఆరోపించారు.

ఎస్సీ, బీసీ, మైనారిటీ బంధుల పేరుతో ఎన్నికల ముందు హాడావిడి చేశార‌ని అన్నారు. బీఆర్ఎస్ పరోక్ష మిత్ర పక్షంగా భావిస్తున్న బీజేపీ పక్కలో బల్లంలా కాచుకుని ఉందని విమ‌ర్శించారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు రావని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చడం కాదు.. నాయకుడిని మార్చాల్చి ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

Exit mobile version