JC Prabhakar Reddy : తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, తన ధాటిగా వ్యవహరించే శైలితో పేరు పొందిన వ్యక్తి. “తగ్గేదేలే” అనే ఆయన తరహా మాటలు రాజకీయ వేదికలపై తరచూ వినిపిస్తుంటాయి. అయితే, ఆయన తాజాగా తన స్వభావానికి భిన్నంగా వ్యవహరించారు. అకస్మాత్తుగా యూ-టర్న్ తీసుకొని అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యానికి క్షమాపణలు చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. గత నెల 27న ఆర్టీపీపీ వద్ద ప్రారంభమైన ఫ్లై యాష్ వివాదం నెలరోజులుగా కొనసాగుతోంది. ఈ వివాదం వల్ల జేసీ వర్గానికి చెందిన లారీలు మూలన పడిపోయాయి, సిమెంట్ ఫ్యాక్టరీల కార్యకలాపాలు స్తంభించాయి. ఈ సమస్యపై సీఎం చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకున్నప్పటికీ, పెద్దగా మార్పు రాలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య ఈ వివాదం చెలరేగడంతో జిల్లా అధికారులు పరిస్థితిని పరిష్కరించడంలో విఫలమయ్యారు.
China Build Largest Dam: భారత సరిహద్దులో 137 బిలియన్ డాలర్లతో చైనా అతిపెద్ద డ్యామ్?
వివాదం నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సిమెంట్ ఫ్యాక్టరీలపై ఆధారపడి జీవిస్తున్న 30 వేల మంది కోసం క్షమాపణలు చెబుతున్నా,” అని అన్నారు. తాను, తన వర్గాలు కలిసిన ఇబ్బందులకు అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యానికి క్షమాపణలు చెప్పారు. గత ఐదేళ్లలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, వైసీపీ పాలనలో తనే లక్ష్యంగా కుట్రలు పన్నారని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. “డబ్బులకు మేం లొంగిపోం. మా DNA డిఫరెంట్,” అని వ్యాఖ్యానించారు. తన గౌరవం కోల్పోయినప్పటికీ, ప్రజల కోసం పోరాడినందునే ఈ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందని వివరించారు.
ఫ్లై యాష్ సమస్యపై డబ్బు కోసం కాకుండా తన గౌరవం కోసం పోరాడానని జేసీ స్పష్టం చేశారు. “వైసీపీ వాళ్లకు లొంగిపోతే ఇన్ని సమస్యలు ఎదురుకాలేవు. కానీ, చంద్రబాబు మీద నమ్మకంతోనే ఈ పోరాటం చేశాను,” అంటూ జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు. నెలరోజులుగా కొనసాగుతున్న ఫ్లై యాష్ వివాదానికి ముగింపు పలకడానికే జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పి వివాదాన్ని శాంతింపజేయాలని ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాడిపత్రి రాజకీయ వేదికపై జేసీ చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త చర్చలకు దారి తీస్తున్నాయి.
Honda SP160: మార్కెట్లోకి విడుదలైన హోండా ఎస్పీ 160 2025 బైక్.. ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!