Site icon HashtagU Telugu

Telangana : బిజెపి తీర్థం పుచ్చుకున్న జయసుధ

Jayasuda Join Bjp

Jayasuda Join Bjp

సినీ నటి , మాజీ ఎమ్మెల్యే జయసుధ (Jayasudha ) ..బుధువారం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో బిజెపి (BJP) కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి , బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా జయసుధకు పార్టీ కండువ కప్పి సభ్యత్వ రశీదును తరుణ్ చుగ్ అందిచారు. దేశ వ్యాప్తంగా మోడీ చేస్తున్న అభివృద్ధి చూసి..బిజెపి లో చేరినట్లు జయసుధ తెలిపారు. తాను ఓ మతపరంగాను, కులపరంగానో పార్టీలో చేరలేదన్నారు. జాతీయ పార్టీ ద్వారా ప్రజలకు మంచి చేయాలనీ ఉందని జయసుధ చెప్పుకొచ్చారు. తాను సినిమాల కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానన్నారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ప్రశ్నకు.. అది కేవలం రూమర్ మాత్రమే.. అందులో నిజం లేదన్నారు.

ప్రస్తుతం బిజెపి రాబోయే ఎన్నికల్లో తెలంగాణ (Telangana ) లో విజయం సాధించాలని చూస్తుంది. ఈ క్రమంలో చేరికలపై దృష్టి సారించి ఇతర పార్టీల నేతలతో పాటు మాజీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తుంది. రీసెంట్ గా పలువురు బిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల నేతలు బిజెపి లో చేరిన సంగతి తెలిసిందే.

ఇక జయసుధ విషయానికి వస్తే..చిత్రసీమలో అగ్ర నటిగా పేరు తెచ్చుకున్న ఈమె..2009 లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ MLAగా విజయం సాధించారు.

Read Also : Delmont: దారుణం.. చిన్నారిని దత్తత తీసుకున్న దంపతులు.. చివరికి అలా?