Janasena: ఏపీ రాజకీయాల్లో పవన్ ఒక కల్లోలం. ప్రజా సమస్యలపై ఆయన స్పందించే తీరే వేరుగా ఉంటుంది. సమస్య ఏదైనా అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు. జగన్ నేతృత్వంలోని పాలన కూడా అధ్వానస్థితిలో ఉందని ప్రజల్లో టాక్ నడుస్తోంది. తాజాగా ఏపీలో ఓ యువతి దారుణ హత్యపై పవర్ స్టార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి అసాంఘిక శక్తులకు, గంజాయికి అడ్డాగా మారిందని మండిపడ్డారు.
తాడేపల్లిలో అంధ యువతి హత్య సంచలనంగా మారింది. ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు అధికార వైసీపీపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ జగన్ పరిపాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని తీవ్రంగా విమర్శిస్తున్నారు. మహిళా చైర్‌పర్సన్‌పైనా మండిపడుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన సేనాని… వైసీపీని ఏకిపారేశారు.
తాడేపల్లిలో అంధ యువతి హత్య పూర్తిగా శాంతిభద్రతల వైఫల్యమేనని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ఆడ బిడ్డలకు అసలు రక్షణ ఉందా అని ప్రశ్నించారు. సీఎం ఇంటికి దగ్గరలోనే ఈ ఘాతకం జరిగినా ఎందుకు మౌనంగా ఉన్నారని జగన్‌ని సూటిగా పవర్‌స్టార్ ప్రశ్నించారు. గతంలో తాడేపల్లి ప్రాంతంలోనే రేప్ కేసు నమోదైన… ఏమి చర్యలు తీసుకున్నారని, ఒక్క నిందితుడిని ఇప్పటికీ పట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.
తాడేపల్లి ఫ్యాలెస్‌లో ఉంటున్న జగన్… ఇంటి పరిసరాల్లోని పరిస్థితిని సమీక్షించుకోలేకపోతే ఎలా అన్నారు. తల్లి పెంపకంలోనే లోపం ఉందని చెప్పే మంత్రులు ఉన్న ప్రభుత్వం ఇదన్నారు. గంజాయికి కేరాఫ్ అండ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌ని మార్చారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
