AP 2024 Elections : తెనాలి జనసేన అభ్యర్థి ని ప్రకటించిన పవన్ కళ్యాణ్..ఫస్ట్ గెలుపు ఇదేనట

పవన్ కళ్యాణ్ నాదెంద్ల మనోహర్ పేరును ప్రకటించి రాజా వర్గానికి షాక్

  • Written By:
  • Updated On - August 2, 2023 / 04:02 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ మొదటి అభ్యర్థిని ప్రకటించారు. తెనాలి నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా నాదెంద్ల మనోహర్ బరిలోకి దిగబోతున్నట్లు తెలిపాడు. అంతే కాదు సీటూ మాదే గెలుపూ మాదే అంటూ తెలిపి జనసేన శ్రేణుల్లో ఉత్సహం నింపారు.

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రణాళికలు , అభ్యర్థులను ఖరారు చేసుకునే పనిలో పడ్డాయి. టీడీపీ , బిజెపి , జనసేన పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ముందుగా జనసేన పార్టీ తమ మొదటి అభ్యర్థిని ప్రకటించి షాక్ ఇచ్చింది. వాస్తవానికి తెనాలి (Tenali Assembly) లో టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజా బరిలో ఉన్నారు. ఆయనే నిలబడతారని ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాదెంద్ల మనోహర్ పేరును ప్రకటించి రాజా వర్గానికి షాక్ ఇచ్చినట్లు అయ్యింది. ఈ ప్రకటన ముందే ఇక్కడి స్థానం గురించి చర్చలు జరిపారా..లేదా అనేది తెలియడం లేదు.

నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మంచి అభ్యర్ధి అని ఈసారి ఆయన గెలిస్తే తెనాలి లో అభివృద్ధి బాగా జరుగుతుందని పవన్ (Pawan) హామీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో నాదెండ్ల మనోహర్ ని గెలిపించడం చాలా అవసరం అని పేర్కొన్నారు. మరి దీనిపై రాజా స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం పవన్ ఫోకస్ అంత కూడా రాజకీయాల ఫైనే పెట్టారు. రీసెంట్ గా స్టార్ట్ చేసిన వారాహి యాత్ర సూపర్ సక్సెస్ కావడం తో మిగతా జిల్లాలో కూడా యాత్రను మొదలుపెట్టాలని , అలాగే జిల్లాల వారీగా ఇంచార్జిలను , ప్రధాన కార్యదర్శిలను నియమించాలని చూస్తున్నాడు.

Read Also : CBI వద్దకు అంబటి..పవన్ ఆదాయం ఫై ఆరా తీయాలని పిర్యాదు..?