Site icon HashtagU Telugu

Jammu Kashmir : జైళ్ల శాఖ DGPహేమంత్ కుమార్ లోహియా దారుణ హత్య…!!

Jammu Encounter

Jammu Encounter

జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్‌కె లోహియా దారుణ హత్యకు గురయ్యారు. జమ్మూలోని ఉదయవాలా ప్రాంతంలో ఆయన స్నేహితుడి ఇంట్లో అనుమానస్పద స్థితిలో ఆయన మరణించారు. పదునైన ఆయుధంతో లోహియా చంపినట్లు తెలుస్తోంది. లోహియాను చంపిన తర్వాత కాల్చే ప్రయత్నం కూడా చేశారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి లోహియా పర్సనల్ అసిస్టెంట్ కనిపించకపోవడంతో…అతనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోహియా మృతదేహాన్ని జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ) ఆస్పత్రికి తరలించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కశ్మీర్ పర్యటన నేపథ్యంలో ఈ హత్య కలకలం రేపింది.

కాగా లోహియా ఆగస్టులో జమ్మూ కశ్మీర్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా నియమితులయ్యారు. ఈ ఘటన తర్వాత పోలీసుశాఖలో తీవ్ర అలజడి నెలకొంది. హేమంత్ ఎందుకు చంపారన్న విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అయినప్పటికీ కేంద్రం హోం మంత్రి అమిత్ షా ప్రస్తుతం జమ్మూ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి దారుణం జరిగడం భద్రతపై ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. కాగా బారాముల్లాలోని ఓ బ్యాంక్ మేనేజర్ పై సోమవారం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డాడు బ్యాంక్ మేనేజర్. ఈ రెండు ఘటనలు జమ్మూ కశ్మీర్ లోని భద్రతను ప్రశ్నిస్తున్నాయి.