Amaravati Vs MAVIGUN: వ‌చ్చే ఎన్నిక‌ల్లో మావిగన్ వర్సెస్ అమరావతి.. వైఎస్‌ జగన్‌ సవాల్..!

ఏపీ రాజధాని అమరావతిని వైసీపీ అధినేత జగన్ మరోసారి తిరస్కరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము మావిగన్‌కే కట్టుబడి ఉన్నామని… వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అని ఆయన అన్నారు. మావిగన్ ప్రతిపాదనకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. మావిగన్‌కు మద్దతు ఇచ్చేవారంతా వైసీపీకి ఓటు వేస్తారని చెప్పారు. ఈ రెండు రాజధానుల్లో ప్రజల మద్దతు దేనికి ఎక్కువగా ఉందో వచ్చే ఎన్నికల్లో తేలిపోతుందని అన్నారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. […]

Published By: HashtagU Telugu Desk
Mavigan vs. Amaravati in the upcoming elections... YS Jagan's challenge!

Mavigan vs. Amaravati in the upcoming elections... YS Jagan's challenge!

ఏపీ రాజధాని అమరావతిని వైసీపీ అధినేత జగన్ మరోసారి తిరస్కరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము మావిగన్‌కే కట్టుబడి ఉన్నామని… వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అని ఆయన అన్నారు. మావిగన్ ప్రతిపాదనకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. మావిగన్‌కు మద్దతు ఇచ్చేవారంతా వైసీపీకి ఓటు వేస్తారని చెప్పారు. ఈ రెండు రాజధానుల్లో ప్రజల మద్దతు దేనికి ఎక్కువగా ఉందో వచ్చే ఎన్నికల్లో తేలిపోతుందని అన్నారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘జగన్ అమరావతికి వ్యతిరేకం’ అంటూ కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను అమరావతికి వ్యతిరేకం కాదని చెప్పారు. అమరావతి పేరుతో చంద్రబాబు సాగిస్తున్న స్కామ్‌లను, అవినీతిని మాత్రమే తాను ప్రశ్నిస్తున్నానని చెప్పారు. అవినీతి లేని రాజధాని కావాలనేదే తన ఆకాంక్ష అని, అందుకే ఈ మావిగన్ ప్రతిపాదనను తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఈ సరికొత్త ప్రతిపాదనకు మద్దతు ఇచ్చేవారంతా వైసీపీకే ఓటు వేస్తారని, వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మావిగన్‌ను చేరుస్తామని స్పష్టం చేశారు.

  Last Updated: 01 Jul 2026, 03:06 PM IST