Site icon HashtagU Telugu

Jammu: 24న మోదీ కశ్మీర్ పర్యటన.. రెచ్చిపోయిన ఉగ్రవాదులు!

Jammu Encounter

Jammu Encounter

మరో రెండు రోజుల్లో (ఏప్రిల్ 24న) కశ్మీర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఉగ్రవాదులు పేట్రేగారు. శుక్రవారం వేకువజామున 3.45 గంటలకు జమ్మూలోని జలాలాబాద్ సుజ్వాన్ ప్రాంతం మీదుగా వెళ్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) బస్సుపై గ్రెనేడ్ విసిరారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సీఐఎస్ఎఫ్ ఏఎస్ఐ ఎస్పీ పాటిల్ అమరుడు కాగా, నలుగురు సీఐఎస్ఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. ఉగ్రవాదులను బస్సులో ఉన్న సీఐఎస్ఎఫ్ బలగాలు బలంగా తిప్పికొట్టాయి. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టారు. వారిద్దరిని ఫిదాయిన్లు (ఉగ్రవాద ఆత్మాహుతి దళ సభ్యులు)గా గుర్తించారు. వారి నుంచి ఆయుధాలు, ఆత్మాహుతి బాంబుల సూట్ లను స్వాధీనం చేసుకున్నారు. ఇక బారాముల్లా జిల్లాలో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో మరో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. వారిలో ఇద్దరు పాకిస్తాన్ కు చెందినవారు.

Exit mobile version