జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో వీర మరణం పొందిన అగ్నివీర్ మురళీనాయక్ (Murali Nayak) కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Jagan) మంగళవారం పరామర్శించారు. మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిలను కలిసిన జగన్, వారి గుండె బాధను అర్థం చేసుకుంటూ ధైర్యం చెప్పారు. తన కుమారుడి త్యాగం దేశం ఎప్పటికీ మరిచిపోలేదని, దేశం ఆయనకు రుణపడి ఉందని జగన్ తెలిపారు.
Private Schools : ప్రవైట్ స్కూళ్ల ఆగడాలకు చెక్ పెట్టబోతున్న సీఎం రేవంత్
ఈ సందర్భంగా జగన్ కుటుంబానికి వైఎస్సార్సీపీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సహాయం (Financial assistance of Rs. 25 lakhs on behalf of YSRCP) ప్రకటించారు. మురళీనాయక్ దేశం కోసం చేసిన త్యాగం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన అంకితభావం, ధైర్యం ప్రతి ఒక్కరికి ప్రేరణ కలిగించేదిగా నిలుస్తుందన్నారు. మురళీనాయక్ లాంటి వీర సైనికుడు మన రాష్ట్రానికి చెందడం గర్వకారణమన్నారు. జగన్ బెంగళూరు నుంచి ఉదయం 11:30 గంటలకు శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకుని మురళీనాయక్ ఇంటికి వెళ్లారు. స్థానిక నాయకులతో పాటు పార్టీ కార్యకర్తలు ఆయనతో కలిసి కుటుంబాన్ని పరామర్శించారు. మురళీనాయక్ స్మృతికి గౌరవంగా ప్రభుత్వం, సమాజం తరఫున ఎప్పుడూ అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు.