Rain Alert : తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రేపు (సోమవారం) వర్షం పడే అవకాశమున్న జిల్లాల్లో.. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి ఉన్నాయి. ఈవిషయాన్ని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇవాళ హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
Also read : Weekly Horoscope: ఈవారం రాశి ఫలితాలు.. వారికి శత్రువులు మిత్రులవుతారు
ఆంధ్రప్రదేశ్ లో నేడు, రేపు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్నిచోట్ల నేడు, రేపు(Rain Alert) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో ఒకటి రెండు ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరిసీతారామరాజు జిల్లాల్లో చెదురుముదురుగా వర్షాలుంటాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. విశాఖ నగరంలోని శివారు ప్రాంతాల్లో నేడు వర్షాలకు అనుకూలంగా ఉందని.. కానీ రేపు వైజాగ్ లో వర్షాలు పడే అవకాశాలున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. రేపు ఉదయం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలుంటాయని అంచనా వేశారు.
Also read : World CUP 2023: డైమండ్ బ్యాట్ తో బరిలోకి కోహ్లీ