Gyanvapi Case: జ్ఞాన్‌వాపి కోర్టు తీర్పుపై బీజేపీ ఎంపీ హేమమాలిని కామెంట్

వారణాసిలోని జ్ఞాన్‌వాపి కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జ్ఞాన్వాపి కాంప్లెక్స్‌లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Gyanvapi Case: వారణాసిలోని జ్ఞాన్‌వాపి కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జ్ఞాన్వాపి కాంప్లెక్స్‌లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంలో వారణాసి జిల్లా జడ్జి నిర్ణయాన్ని సవాలు చేస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు వేసిన పిటిషన్‌ను కూడా హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఈ నిర్ణయంపై మధుర బీజేపీ ఎంపీ హేమమాలిని స్పందించారు.

కోర్టు తీర్పు మంచి నిర్ణయమేనని అన్నారు. వీలైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలి, లేకుంటే ఏదో ఒక వివాదం కొనసాగుతూనే ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ఇష్యూపై త్వరగా నిర్ణయం వస్తే దేశానికి మేలు జరుగుతుందని తెలిపారు బీజేపీ ఎంపీ హేమమాలిని.

Also Read: Andhra Pradesh : ఆర్5 జోన్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుని ఆశ్ర‌యించ‌నున్న ఏపీ సర్కార్‌