Site icon HashtagU Telugu

World Heart Day : హైపర్ టెన్షన్ తో గుండెకు గండం.. సరైన జీవనశైలితో సంపూర్ణ ఆరోగ్యం

World Heart Day

Heart

World Heart Day : గుండెలో ఏదో గడబిడ జరుగుతోంది. చాలామంది ఇటీవల కాలంలో ఆకస్మిక గుండెపోట్లతో చనిపోతున్నారు. జిమ్ చేస్తుండగా హార్ట్ ఫెయిల్యూర్ జరిగి చనిపోయిన ఘటనలను కూడా మనం చూశాం. మారుతున్న జీవన శైలి, మారిపోయిన ఆహారపు అలవాట్లు, గైడెన్స్ లేని మితిమీరిన వ్యాయామం గుండె ఫెయిలయ్యే రిస్క్ ను పెంచుతున్నాయి. అందుకే గుండెపోటు మరణాలు రోజురోజుకు పెరుగుతూపోతున్నాయి. ఇవాళ ‘ప్రపంచ హృదయ దినోత్సవం’ సందర్భంగా గుండె ఆరోగ్యంతో ముడిపడిన కొన్ని విషయాలను తెలుసుకుందాం..

Also read : AP: లోకేష్ అరెస్ట్ అయితే ఎలా..? చంద్రబాబు ఏ సలహా ఇవ్వనున్నాడు..?

గుండె సంబంధిత సమస్యలు, వాటి నివారణ చర్యలపై  ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ హృదయ సమాఖ్య, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ అంతర్జాతీయ కార్యక్రమాన్ని రూపొందించాలని భావించాయి. 1997 నుంచి 1999 వరకు వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన ఆంటోని బేయెస్ డి లూనా ఈ ఆలోచనను తొలిసారిగా అమలు చేశారు. ‘ప్రపంచ హృదయ దినోత్సవం’ను 2000 సెప్టెంబర్ 24న మొదటిసారి నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో 90కి పైగా దేశాలు పాల్గొని.. ఏటా సెప్టెంబర్ 29న ‘ప్రపంచ హృదయ దినోత్సవం’ను నిర్వహించాలని నిర్ణయించాయి.  ఈ రోజున ప్రజలకు గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తుంటారు.

హైపర్ టెన్షన్ తో పెద్ద ముప్పు..