టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా నేడు ఐటీ ఉద్యోగులు బ్లాక్ డ్రెస్‌లతో ఆఫీసులకు వెళ్లాలని పిలుపునిచ్చారు. “బ్లాక్ డే – ఫ్రైడే “అనే నినాదంతో ఐటీ ఉద్యోగులు కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో అనేక కార్యక్రమాలు చేసిన ఐటీ ఉద్యోగులు తాజాగా ఈ రోజు చంద్రబాబుకు మద్దతుగా బ్లాక్ డ్రెస్‌లతో ఆఫీసులకు వెళ్లనున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన మొదటి రోజు నుంచి ఐటీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనలు వివిధ రూపాల్లో చేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరులో ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. చంద్రబాబు అభివృద్ధి చేసిన ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేసి తమ మద్దతు తెలిపారు. మరోవైపు రాజమండ్రిలో ఉన్న నారా భువనేశ్వరిని కలిసి ఐటీ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టిన ఐటీ ఉద్యోగులు రాజమండ్రి చేరుకుని భువనేశ్వరిని కలిశారు.
Also Read: BRS : 54 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోల్ ఇంఛార్జ్‌లను నియమించిన బీఆర్ఎస్