Chandrayaan3-Moon Road : చంద్రయాన్-3 మిషన్ కీలక దశకు చేరింది.
చంద్రుడి దిశగా దూసుకెళ్తున్న చంద్రయాన్-3 వ్యోమ నౌక తాజాగా భూమి యొక్క అన్ని కక్ష్యలను దాటేసింది.
ఇప్పుడది చంద్రుడి అవతలి కక్ష్యలోకి ప్రవేశించింది.
చంద్రుడి దక్షిణ ధ్రువం దిక్కుగా ప్రస్తుతం వ్యోమ నౌక వెళ్తోంది..
ఈవిషయాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మంగళవారం వెల్లడించింది.
Also read : Tomato Prices: దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఎలా ఉన్నాయంటే..?
చంద్రయాన్ 3 వ్యోమనౌక భూమి కక్ష్యను వదిలి, చంద్రుడి కక్ష్యలోకి ఎంటర్ అవుతున్న దానికి సంబంధించిన “పెరిజీ-ఫైరింగ్” ప్రక్రియను బెంగళూరులో ఉన్న ISTRAC (ISRO టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్) ఆఫీసులో ప్రదర్శించారు. అంతరిక్ష నౌకను సక్సెస్ ఫుల్ గా ట్రాన్స్‌లూనార్ కక్ష్యలోకి ప్రవేశపెట్టామని ఇస్రో తెలిపింది. ఇక చంద్రయాన్ 3 వ్యోమనౌక నెక్స్ట్ స్టాప్ చంద్రుడే అని వెల్లడించింది. చంద్రుడిపై చంద్రయాన్ 3లోని ల్యాండర్ “విక్రమ్” ఆగస్టు 23న అడుగు మోపే అవకాశాలు ఉన్నాయి.అంతకంటే ముందు ఆగస్టు 5న లూనార్-ఆర్బిట్ ఇన్సర్షన్ (LOI) ప్రక్రియ జరుగుతుంది. జూలై 14న చంద్రయాన్-3 మిషన్ ను(Chandrayaan3-Moon Road) ప్రయోగించిన సంగతి తెలిసిందే.
Also read : Reliance JioBook 2023 : జియో మరో సంచలనం.. లేటెస్ట్ లాప్‌టాప్ ధర ఎంతంటే?