ISRO Next Mission : చంద్రుడిపై పరిశోధనా స్థావరం నిర్మాణం.. ఇస్రో, జాక్సా ప్లాన్!

ISRO Next Mission : చంద్రయాన్-3తో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఇస్రో.. ఫ్యూచర్ లోనూ మరిన్ని మూన్ మిషన్స్ చేపట్టేందుకు రెడీ అవుతోంది.

  • Written By:
  • Updated On - August 23, 2023 / 03:09 PM IST

ISRO Next Mission : చంద్రయాన్-3తో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఇస్రో.. ఫ్యూచర్ లోనూ మరిన్ని మూన్ మిషన్స్ చేపట్టేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా జపాన్ తో కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతోంది. జపాన్ దేశపు అంతరిక్ష పరిశోధనా సంస్థ  “జాక్సా”(జపాన్‌ ఏరోస్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఏజెన్సీ)తో కలిసి 2025 సంవత్సరంలో చంద్రుడిపైకి రోవర్‌ను పంపనుంది. ఈ ఇంటర్నేషనల్ మూన్ రీసెర్చ్ ప్రాజెక్టుకు లూనార్‌ పోలార్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ (LUPEX) అనే పేరును డిసైడ్ చేశారు.

Also read : Station Ghanpur: కడియంకు రాజయ్య సహకరిస్తాడా?

ఈ మిషన్ లో భాగంగా భారత్‌, జపాన్‌తో పాటు అమెరికా, యూరోపియన్‌ యూనియన్ స్పేస్ ఏజెన్సీల పరిశోధనా పరికరాలను చందమామపైకి తీసుకుపోనున్నారు. ఆ పరికరాలతో చంద్రుడి ధ్రువాల వద్ద నీటి ఆవిరి ఉనికి, అక్కడి ధూళిలో విద్యుదయస్కాంత పరిమాణాన్ని స్టడీ (ISRO Next Mission) చేయనున్నారు. ఇంతకు మించిన ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది. చంద్రునిపై ఒక శాశ్వత పరిశోధనా స్థావరాన్ని స్థాపించడమే ఆ భారీ లక్ష్యం. ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్ కోసం ఇస్రో, జాక్సా కలిసి ఓ రోవర్‌ను ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నాయి.