Israel-Iran: ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

Israel-Iran: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా వౌనంగా హెచ్చరించినా, ఇజ్రాయెల్ తీరులో మార్పు రాలేదు.

Published By: HashtagU Telugu Desk
Iran- Israel War

Iran- Israel War

Israel-Iran: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా వౌనంగా హెచ్చరించినా, ఇజ్రాయెల్ తీరులో మార్పు రాలేదు. తాము ఎప్పుడూ ముందడుగు వేస్తామని చెప్పినట్టుగానే, ఇజ్రాయెల్ తాజాగా ఇరాన్‌పై ముందస్తు వైమానిక దాడులకు పాల్పడింది. టెహ్రాన్ పరిసరాల్లోని కొన్ని ప్రాంతాలపై ఈ దాడులు జరగగా, ప్రత్యేకంగా అణు స్థావరాలే లక్ష్యంగా తీసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో టెహ్రాన్ నుంచి కౌంటర్ దాడులు వచ్చే అవకాశం ఉండటంతో, ఇజ్రాయెల్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

Ahmedabad Air Crash – Ex-Gujarat CM : అదృష్ట సంఖ్యే దురదృష్టకరంగా మారింది!

ఇజ్రాయెల్ దాడులపై అమెరికా వెంటనే స్పందించింది. ఈ చర్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇది పూర్తిగా ఇజ్రాయెల్ స్వతంత్ర నిర్ణయమేనని పేర్కొంది. దాడుల్లో ప్రధానంగా ఇరాన్‌కు చెందిన అణు, సైనిక స్థావరాలే లక్ష్యంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి ప్రతిగా ఇరాన్ భారీ క్షిపణులు, డ్రోన్లతో స్పందించవచ్చన్న హెచ్చరికలు వెలువడుతున్నాయి. దీనితో దేశవ్యాప్తంగా పౌరులను అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవావ్ గాలంట్ హెచ్చరించారు. ఇప్పటికే అపరాత్రి నుంచే ఎమర్జెన్సీ చర్యలు అమలులోకి వచ్చాయి.

ఇక ఈ పరిణామాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు జాగ్రత్త చర్యలతో స్పందించారు. పశ్చిమాసియా తీవ్రంగా మంటలు ఎగసే ప్రాంతంగా మారనుందని హెచ్చరించిన ట్రంప్, అక్కడున్న అమెరికన్ దౌత్య సిబ్బందిని, సైనికులను తక్షణమే ఖాళీ చేయాలని సూచించారు. అలాగే ఇజ్రాయెల్‌కు దాడులు చేయొద్దని కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించినా, ఇజ్రాయెల్ మాత్రం ఏ మేరకూ వెనక్కి తగ్గక, ముందుగానే దాడులకు దిగింది.

దీంతో ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య పరిస్థితి అతి ప్రమాదకర దశకు చేరుకుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రతీకార చర్యలు వస్తాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం పూర్తిగా ఏర్పడింది.

Ahmedabad Plane Crash : కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సభ వాయిదా

  Last Updated: 13 Jun 2025, 10:50 AM IST