Israel Hamas War: ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుద్ధం మరింత ముదిరింది. గాజాను సర్వనాశనం చేసే వరకు ఇజ్రాయెల్ వెనక్కి తగ్గట్లేదు. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 7700 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుల్లో దాదాపు 300 మందిని గుర్తించలేదు. దీంతో గాజాలో పరిస్థితి రోజూలాగే శనివారం కూడా భయం భయంగా గడిచిపోయింది. మరోవైపు మూడు వారాల క్రితం ప్రారంభమైన ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య 9 వేలు దాటింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో రక్తపుటేరులు పారుతున్న వేళ.. ఇప్పుడు ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. హమాస్ దాడులకు ఇజ్రాయెల్ దీటుగా బదులిస్తోంది. ఈ క్రమంలో వేలాది మంది మరణిస్తున్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించిన జర్నలిస్ట్ 32 మంది కుటుంబ సభ్యులను ఖననం చేశాడు. దీనికి సంబందించిన ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి.
Also Read: Bangladesh Violence: బంగ్లాదేశ్ హింసలో పోలీసు మృతి, 200 మంది గాయాలు