Ram Gopal Varma ప్రేమ మరీ ఇంత గుడ్డిదా?: వర్మ ట్వీట్

సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా స్పందించారు. ఈ కేసును ప్రస్తావిస్తూ హతుడు, నిందితుల ఫొటోలతో తన స్టైల్ లో ట్వీట్

Published By: HashtagU Telugu Desk
Ram Gopal Varma Is Love So Blind.. Varma's Tweet

Ram Gopal Verma Is Love So Blind.. Verma's Tweet

సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తాజాగా స్పందించారు. ఈ కేసును ప్రస్తావిస్తూ హతుడు, నిందితుల ఫొటోలతో తన స్టైల్ లో ట్వీట్ చేశారు. నవీన్, హరిహర, నిహారిక ఫొటోలను చూపిస్తూ.. నిహారిక కోసం హరిహరకృష్ణ తన స్నేహితుడు నవీన్ ను చంపేశాడని వర్మ చెప్పారు. ప్రేమ గుడ్డిదని తెలుసు కానీ మరీ ఇంత గుడ్డిదా.. అని ప్రశ్నించారు. వర్మ ట్వీట్ పై నెటిజన్లు అదే స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు . మీ సినిమాలకు సరిగ్గా సరిపోయే కథ అని కొంతమంది కామెంట్ చేశారు.

నిహారికకు తనకు మధ్య అడ్డొస్తున్నాడనే కోపంతో హరిహరకృష్ణ తన స్నేహితుడు నవీన్ ను అత్యంత దారుణంగా చంపేశాడు. ఆపై శరీరాన్ని చీల్చి, గుండె, మర్మంగాలను కూడా కోసి బయటకు తీశాడు. డెడ్ బాడీ ఆనవాళ్లు గుర్తించకుండా మార్చేసేందుకు ప్రయత్నించాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ప్రస్తుతం ఈ కేసులో హరిహరకృష్ణతో పాటు అతడికి సాయం చేసిన నిహారిక, స్నేహితుడు హసన్ లను పోలీసులు జైలుకు పంపారు. కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:  Chess Board Station: చెస్ బోర్డ్ లా కనిపించే రైల్వే స్టేషన్ ను మీరు ఎప్పుడైనా చూసారా!

  Last Updated: 13 Mar 2023, 12:26 PM IST