RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఫైనల్ మ్యాచ్ జూన్ 3 మంగళవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) , పంజాబ్ కింగ్స్ మధ్య ఘన పోరాటం జరగబోతుంది. క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్‌పై అద్భుత విజయంతో నేరుగా ఫైనల్‌కు చేరుకున్న బెంగళూరు, ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకునేందుకు సంసిద్ధంగా ఉంది. అయితే ఫైనల్ ముందు ఆర్సీబీకి పెద్ద షాక్ తగిలింది. ఆర్సీబీ బిగ్ మ్యాచ్ విన్నర్, విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఈ కీలక మ్యాచ్‌లో ఆడకపోవడానికి అవకాశం ఉందని సమాచారం.
Rajasaab Release Date : రాజాసాబ్ టీజర్ రిలీజ్ డేట్ లాక్.. మూవీ రిలీజ్ డేట్ కూడా
సోమవారం ఆర్సీబీ పట్టు పెట్టి ప్రాక్టీస్ చేసినప్పటికీ, ఫిల్ సాల్ట్ ఆ ప్రాక్టీస్ సేశన్లో కనిపించలేదని కొన్ని జాతీయ మీడియాలు తెలిపాయి. సాల్ట్ ప్రాక్టీస్‌కు ఎందుకు హాజరుకాలేదనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. అయితే అతని భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నందున ఆమెకు సపోర్ట్ ఇచ్చేందుకు ఇంగ్లాండ్ వెళ్లినట్లు సమాచారం. సాల్ట్ ఈ విషయం గురించి కోచ్ ఆండీ ఫ్లవర్, కెప్టెన్ రజత్ పాటిదార్‌లకు వివరించి వెళ్లాడు. ఈ విషయం ఆర్సీబీ యాజమాన్యం గోప్యంగా ఉంచిందని తెలుస్తోంది. సాల్ట్ ఫైనల్‌కు అందుబాటులో ఉంటాడా లేకపోతే అనేది టాస్ వరకు నిరీక్షించాల్సి ఉంది. సాల్ట్ లేకపోతే, జట్టులో టిమ్ సీఫర్ట్ కలుపుకోబడే అవకాశం ఉంది.
ఫిల్ సాల్ట్ ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లలో 387 పరుగులు చేయగా, 4 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. క్వాలిఫయర్-1లో సాల్ట్ పంజాబ్ బౌలర్లను చిత్తుచేసి ఆటను అతడి వైపు మార్చిన విషయం తెలిసిందే. సాల్ట్ లేకపోతే, ఆర్సీబీకి ఇది భారీ దెబ్బ అవుతుందని చెప్పాలి. అదేవిధంగా, తొడ కండరాల గాయంతో బాధపడుతున్న హిట్టర్ టిమ్ డేవిడ్ కూడా ఫైనల్‌కు అందుబాటులో ఉంటాడో లేదో క్లారిటీ లేదు. తాజాగా సమాచారం ప్రకారం, ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా డేవిడ్ గాయపడిన సంగతి ఉంది. ఆయన కూడా ఫైనల్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
Turkey Earthquake : తెల్లవారుజామున టర్కీలో భూకంపం.. పరుగులు తీసిన జనం..