Site icon HashtagU Telugu

India: భారత్ లో ఇంటర్నెట్ షట్‌డౌన్‌ వల్ల కోట్లలో నష్టం

India

New Web Story Copy 2023 06 29t134626.669

India: దేశంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభుత్వం సాధారణంగా ఇంటర్నెట్ నిలిపివేయడం జరుగుతూ ఉంటుంది. ఓ నివేదిక ప్రకారం ఇంటర్నెట్ షట్‌డౌన్‌ కారణంగా అశాంతిని అణిచివేస్తాయని, తప్పుడు సమాచారం వ్యాప్తిని కట్టడి చేస్తుందని, లేదా సైబర్‌ సెక్యూరిటీ సమస్యలు తగ్గించవచ్చని ప్రభుత్వాలు తరచుగా చెప్తుంటాయి. అయితే ఇంటర్నెట్ అలా నిలిపివేయడం ద్వారా జరిగే నష్టం చాలా ఎక్కువే. ప్రస్తుతం ఇంటర్నెట్ ద్వారా దేశంలో అనేక లావాదేవీలు, ప్రభుత్వ సంస్థలు, ప్రయివేట్ సంస్థలు శరవేగంగా తమ పనులను నిర్వర్తిస్తాయి. ఈ క్రమంలో ఇంటర్నెట్ ఆపేయడం ద్వారా ఎంత నష్టమో ఊహించవచ్చు.

ఇటీవల కాలంలో మణిపూర్ మరియు పంజాబ్‌లలో ఇంటర్నెట్ షట్‌డౌన్‌ చేయాల్సి వచ్చింది. ఆ ప్రాంతాల్లో ఉద్యమాలు, నిరసనలు, అల్లర్ల కారణంగా ప్రభుత్వం ఇంటర్నెట్ ను నిలిపివేసింది. దీని వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు దాదాపు 200 వందల కోట్లు నష్టం వాటిల్లింది. అదేవిధంగా దాదాపు 11800 కోట్లు విదేశీ పెట్టుబడుల నష్టం మరియు దాదాపు 21,268 మంది ఉద్యోగాలు కోల్పోయారని ఒక నివేదిక వెల్లడించింది. భారతదేశం ఇలా ఇంటర్నెట్ షట్‌డౌన్‌ చేయడం ద్వారా ఈ సంవత్సరం ఇప్పటివరకు 16 శాతం షట్‌డౌన్ ప్రమాదం జరిగింది, ఇది 2023 నాటికి ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని తాజా నివేదిక వెల్లడించింది.

Read More: NTR Fan: శ్యామ్ మృతిపై చంద్రబాబు ఆరా, కుటుంబానికి 2 లక్షల సాయం