Indigo Flight: పక్షిని ఢీకొట్టిన ఇండిగో విమానం.. తప్పిన పెను ప్రమాదం

టేకాఫ్‌కి సిద్ధమవుతున్న సమయంలో విమాన రెక్కలకు ఒక పక్షి తగిలింది.

Published By: HashtagU Telugu Desk
Indigo

1028434 Indigo Represent

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం దుబాయ్ వెళ్తున్న ఇండిగో విమానం (Indigo Flight) టేకాఫ్ అవుతుండగా పక్షి ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఉదయం 8.30 గంటలకు విమానం మంగళూరు నుంచి దుబాయ్ (Dubai) వెళ్తోంది. ఫ్లైట్ టాక్సీవేని దాటి టేకాఫ్‌కి సిద్ధమవుతున్న సమయంలో విమాన రెక్కలకు ఒక పక్షి తగిలింది.

దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయపడ్డారు. ఈ ఘటనపై పైలట్‌ వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ)కి సమాచారం అందించాడు. టేకాఫ్‌ (Take off)ను రద్దు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రయాణికులు దుబాయ్ వెళ్లేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. విమానాన్ని సాంకేతిక (Techincal) నిపుణులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: BRS Lose: ఆ ఎమ్మెల్యేలకు టికెట్స్ ఇస్తే.. 14 సీట్లు ఓడిపోవడం పక్కా!

  Last Updated: 25 May 2023, 01:14 PM IST