ATM నుండి డబ్బులు డ్రా చేయాలంటే కార్డు స్వైప్ చేయాల్సిందే..డెబిట్ కార్డ్ (Debit Card) లేదా క్రెడిట్ కార్డ్ (Credit card) స్వైప్ చేసి మనీ తీసుకుంటాం. కానీ ఇక నుండి ATM కార్డు అవసరం లేదు. ATM కార్డు లేకుండానే డబ్బులు తీసుకోవచ్చు. అదేలా అనుకుంటున్నారా..ఫోన్ ఆధారిత యాప్ యూపీఐ -ఏటీఎం ద్వారా మనీ విత్ డ్రా చేసుకోవచ్చు.
కేంద్రం UPI చెల్లింపులకు ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూడు యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) పేమెంట్స్ జరుగుతున్నాయి. చిన్న చిల్లర దుకాణం దగ్గరి నుండి మాల్స్ వరకు ఎక్కడ చూడు UPI పేమెంట్స్ జరుగుతున్నాయి. పేటీఎం, భీమ్ యాప్, గూగుల్ పేతో పాటు ఇతర పేమెంట్ యాప్‌లు, కెనరా బ్యాంక్, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, పీఎన్‌బీ, ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. యూపీఐ లైట్ సేవలందిస్తున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థతో సంభాషించడం ద్వారా యూపీఐతో చెల్లింపులు జరిపే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి రావడం తో UPI ఆధారిత చెల్లింపులు ఎక్కువై పోయాయి.
ఇక ఇప్పుడు ఎటువంటి కార్డు లేకుండా యూపీఐ యాప్ ఆధారిత ఏటీఎం సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మొదటి యూపీఐ ఏటీఎం (UPI ATM) లాంఛ్ అయింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో (NPCI) కలిసి హిటాచీ పేమెంట్స్ సర్వీసెస్ తొలి యూపీఐ ఏటీఎం (India’s First UPI-ATM ) ను ముంబైలోని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (Global Fintech Fest )లో ప్రారంభించింది. కార్డ్ అవసరం లేకుండా ఈ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయొచ్చు. కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్స్‌ని (Cardless Cash Withdrawals) ప్రోత్సహించేందుకు ఈ ఏటీఎంను రూపొందించడం విశేషం. అయితే ఈ యూపీఐ ఏటీఎం ఎలా పనిచేస్తుంది? సాధారణ కస్టమర్లు దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు? యూపీఐ యాప్స్ ఉపయోగించి ఈ ఏటీఎం నుంచి డబ్బులు ఎలా డ్రా చేయాలో చూద్దాం.
ఈ ఏటీఎంలో యూపీఐ క్యాష్ విత్ డ్రాయల్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఎంచుకొని, యూపీఐ యాప్ ద్వారా ఏటీఎం స్క్రీన్ పైన కనిపించే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా యూపీఐ యాప్ నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు. కోడ్ స్కాన్ చేసి, అమౌంట్ ఎంటర్ చేసి, పిన్ ఎంటర్ చేస్తే చాలు. అమౌంట్ డ్రా అవుతాయి.
యూపీఐ ఏటీఎం ఇంటర్‌ఆపరబుల్, కార్డ్‌లెస్ లావాదేవీ సౌకర్యాలను అందిస్తుంది. ప్రతి లావాదేవీకి విత్‌డ్రాయల్ లిమిట్ రూ.10,000. రోజువారీ లిమిట్ విషయానికి వస్తే యూపీఐ ఏటీఎం లావాదేవీల కోసం జారీచేసే బ్యాంక్ సెట్ చేసిన పరిమితి ప్రకారం ఉంటుంది. యూపీఐ ఏటీఎంలో నగదు విత్‌డ్రా కోసం కార్డ్‌ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. యూపీఐ యాప్‌ని ఉపయోగించి వేర్వేరు అకౌంట్ల నుంచి డబ్బులు డ్రా చేయొచ్చు.
UPI ATM: The future of fintech is here! 💪🇮🇳 pic.twitter.com/el9ioH3PNP
— Piyush Goyal (@PiyushGoyal) September 7, 2023