Site icon HashtagU Telugu

Infosys: రష్యా నుంచి ఇన్ఫోసిస్ నిష్క్రమణ..!!

Infosys

ఉక్రెయిన్ పై యుద్ధాన్ని మొదలుపెట్టిన రష్యాపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ద కాంక్షతో రగిలిపోతుందంటూ రష్యాపై ఇప్పటికే అనేక దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆయా దేశాలతో పాటు పలు వాణిజ్య సంస్థలు కూడా రష్యాపై పలు ఆంక్షలను విధించాయి. ఇప్పుడు తాజాగా భారత్ కు చెందిన ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిన్ కూడా ఇదే బాటలో పయనించింది.

రష్యాలో తన ఐటీ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ఇన్ఫోసిస్ బుధవారం కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ పై యుద్ధం కారణంగానే ఐటీ కార్యకలాపాలను నిలిపిస్తున్నట్లుగా ఇన్ఫోసిస్ తన ప్రకటనలో పేర్కొంది. సంస్థ ప్రకటన నేపథ్యంలో రష్యాలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలన్నీ కూడా నిలిచిపోనున్నాయి.

ఇక ఇప్పటికే ఐటీ సంస్థలైన SAP, ఒరాకిల్ కూడా రష్యాలో ఐటీ కార్యకలాపాలను నిలిపివేశాయి. ఉక్రెయిన్ వైస్ ప్రైమ్ మినిస్టర్ మైకైల్ ఫెడోరోవ్ అభ్యర్థణ మేరకు ఈ రెండు ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నాయి.