Site icon HashtagU Telugu

Ahmedabad Plane Crash : విమాన ప్రమాదంపై దర్యాప్తుకు అమెరికా బృందం

Plane Crash

Plane Crash

Ahmedabad Plane Crash : అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తును ప్రారంభించింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వానికి చెందిన విమాన ప్రమాదాల దర్యాప్తు మండలి (Air Accident Investigation Board – AAIB) విచారణ చేపట్టింది. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టతకు రావాలన్న ఉద్దేశంతో అధికారులు శ్రమిస్తున్నారు. కూలిన విమానంలో టెక్నికల్ లోపమా, మానవ తప్పిదమా అనే కోణాల్లో విచారణ జరుగుతోంది.

ఈ దుర్ఘటన అంతర్జాతీయ స్థాయిలో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికాకు చెందిన అత్యున్నత విమాన భద్రతా దర్యాప్తు సంస్థ.. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB).. ఈ ఘటనపై స్పందిస్తూ, దర్యాప్తుకు సహకరించేందుకు తమ బృందాన్ని భారత్‌కు పంపిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. భారత దర్యాప్తు సంస్థ అయిన ఏఏఐబీ (AAIB)తో సమన్వయంతో సమాచారం సేకరణ, సాంకేతిక విశ్లేషణలో తమ సహాయాన్ని అందించనున్నట్లు ఎన్‌టీఎస్‌బీ స్పష్టం చేసింది.

Warning : రౌడీలకు చంద్రబాబు హెచ్చరిక

ఇంతటితో ఆగకుండా, ఈ ఘటనపై బ్రిటన్ కూడా స్పందించింది. లండన్‌కు బయలుదేరుతున్న ఈ విమానంలో బ్రిటిష్ పౌరులు కూడా ఉండటంతో, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ప్రత్యేకంగా స్పందించారు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ కోసం తమ వైమానిక దర్యాప్తు నిపుణుల బృందాన్ని భారత్‌కు పంపిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ బృందం భారత అధికారులతో కలిసి సహకారంగా పనిచేస్తూ, కారణాలపై స్పష్టతకు తీసుకువచ్చేందుకు సహాయపడనుంది.

ప్రస్తుతం బ్లాక్‌బాక్స్‌ సేకరణ, హాస్టల్‌పై కూలిన విమానం శకలాల విశ్లేషణ వంటి కీలక దశల్లో దర్యాప్తు కొనసాగుతోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ నేతృత్వంలో జరుపుతున్న ఈ విచారణ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ప్రజల భద్రత, విమానయాన ప్రమాణాల పట్ల ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని ఈ దర్యాప్తు వెల్లడించనుంది.

Ahmedabad Plane Crash : బ్రతికింది ఇతడొక్కడే..నిజంగా ఇతడు మృత్యుంజయుడే !!