Site icon HashtagU Telugu

India Turkey: టర్కీకి దెబ్బ మీద దెబ్బ.. భారత్ మరో నిర్ణయం

138 flights cancelled at Delhi airport

138 flights cancelled at Delhi airport

India Turkey: ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్‌కు మద్దతుగా టర్కీ వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టర్కీ చర్యలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా కౌంటర్లు వేస్తోంది. ఈ క్రమంలో ఇండిగో విమానయాన సంస్థ టర్కీకి సంబంధించి చేస్తున్న కార్యకలాపాలపై కేంద్రం కొరడా ఝులిపిస్తోంది. తాజాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుంచి ఇండిగోకు కీలక ఆదేశాలు వచ్చాయి. టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో ఇండిగోకున్న ‘డంప్ లీజు’ ఒప్పందాన్ని 2025 ఆగస్టు 31 లోగా పూర్తిగా ముగించాల్సిందిగా స్పష్టమైన సూచనలు చేసింది. ప్రస్తుతం ఈ ఒప్పందం కింద ఇండిగో బోయింగ్ 777-300ER విమానాలను టర్కీ నుంచి లీజుకు తీసుకొని, ఢిల్లీ, ముంబై నుంచి ఇస్తాంబుల్ వరకు సేవలు అందిస్తోంది.

India-US: భారత్‌తో వాణిజ్యఒప్పందం కుదిరే సమయం ఆసన్నమైంది: ట్రంప్‌

వాస్తవానికి ఈ లీజు 2024 మే 31తోనే ముగియాల్సి ఉండేది. అయితే ఇండిగో దాన్ని మూడు నెలలు పొడిగించాలని కోరగా, DGCA సెప్టెంబరు 2024 వరకు మాత్రమే ఆమోదం తెలిపింది. కానీ, మరోసారి పొడిగింపు కోరిన ఇండిగో అభ్యర్థనను DGCA ఖండించింది. ఇది చివరి అవకాశం అని తేల్చి చెప్పింది. ఇది టర్కీకి రెండో భారీ దెబ్బ. ఇంతకు ముందు టర్కీకి చెందిన సెలెబి ఏవియేషన్‌కు కేంద్ర ప్రభుత్వం భద్రతా అనుమతులు రద్దు చేసింది. సెలెబి సంస్థ భారత్‌లో తొమ్మిది ప్రధాన విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందిస్తుండగా, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) నుంచి బ్లాక్ చేయబడింది.

ఈ చర్యల వెనుక ప్రధాన కారణం – టర్కీ ఇటీవల భారత్‌ను ఉగ్రవాదంపై విమర్శించడం. పుల్వామా తర్వాత భారత్ పాక్‌పై చేసిన వైమానిక దాడులపై టర్కీ తీవ్రంగా స్పందించడంతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. ఇకపై టర్కీతో సంబంధాలను క్రమంగా తగ్గించేందుకు భారత్ కసరత్తు చేస్తోంది. ఇండిగో లీజు రద్దు, సెలెబి అనుమతుల రద్దు, అంతేగాక కొన్ని ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీలు టర్కీకి ట్రావెల్ చేయొద్దని హెచ్చరించడం కూడా దీనికి నిదర్శనమే. ఈ పరిణామాల నేపథ్యంలో టర్కీకి వ్యాపార, ప్రయాణ రంగాల్లో భారత్ నుంచి వచ్చే మద్దతు భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. భారత ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలన్నీ జాతీయ భద్రత, ఆత్మగౌరవం కోణంలో చర్చకు వస్తున్నాయి.

AP : అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్‌ ఏర్పాటుపై ఐటీ శాఖ ఉత్తర్వులు