Deepak Chahar: ఇంటివాడయిన దీపక్ చాహార్!

టీమిండియా పేసర్ దీపక్ చాహర్ ఓ ఇంటివాడయ్యాడు. ఆగ్రాలోని ఓ ప్రైవేటు వేడుకలో తన స్నేహితురాలు జయ భరద్వాజను వివాహం చేసుకున్నాడు.

  • Written By:
  • Updated On - June 2, 2022 / 03:17 PM IST

టీమిండియా పేసర్ దీపక్ చాహర్ ఓ ఇంటివాడయ్యాడు. ఆగ్రాలోని ఓ ప్రైవేటు వేడుకలో తన స్నేహితురాలు జయ భరద్వాజను వివాహం చేసుకున్నాడు. తన పెళ్లికి సంబంధించిన ఫొటోను అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు. ఆమె మెడలో దండ వేస్తున్నట్లు ఉన్న ఫొటోతో పాటు తన భార్య గురించి క్యాప్షన్ పెట్టాడు. నేను నిన్ను మొదటిసారి కలుసుకున్నప్పుడు నువ్వే నాకు సరైన వ్యక్తివని తెలిసింది. మనమిద్దరం జీవితంలో ఎన్నో ఆనందాలను కలిసి పంచుకున్నాం. ఎల్లవేళలా ఇలాగే సంతోషంగా ఉంచుతానని నేను నీకు ప్రమాణం చేస్తున్నాను. ఇది నా జీవితంలోని అత్యుత్తమ క్షణాల్లో ఒకటి. అందరూ దయచేసి మీ ఆశీస్సులు మాకు అందించండి అని దీపక్ చాహర్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో రాశారు.

దీపక్ చాహర్ అర్ధాంగి జయా భరద్వాజ్ దిల్లీలోని ఎన్‌సీఆర్‌లో కార్పోరేట్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. బిగ్‌బాస్ ఫేమ్ సిద్ధార్థ్ భరద్వాజ్ ఆమెకు సోదరి. దీపక్ చాహర్, జయా భరద్వాజ్ రిసెప్షెన్ వేడుక దిల్లీలోని ఐటీసీ మౌర్య హోటెల్‌లో కమల్ మహల్‌ లో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సీఎస్‌కే టాప్ స్టార్స్ సహా కోహ్లీ, అనుష్క దంపతులు హాజరుకానున్నారు. ఐపీఎల్ మెగా వేలంలో దీపక్ చాహర్ ను చెన్నై సూపర్ కింగ్స్ 14 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా సీజన్ కి దూరమయ్యాడు.