Mamata Banerjee : తృణమూల్ కాంగ్రెస్ సమావేశంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల సంఘం సాయంతో ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ ఓటర్లను తమ రాష్ట్ర జాబితాలో బీజేపీ చేర్చుతోందని దుయ్యబట్టారు. వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఎన్నికల సంఘం కార్యాలయం ముందు నిరవధిక దీక్ష చేపడతానని మమతా బెనర్జీ హెచ్చరించారు.
Read Also: Congo Unknown illness: కాంగో దేశంలో విస్తరిస్తున్న వింత వ్యాధి.. 50కి పైగా మరణాలు!
ఓటర్ల జాబితాను సరిచేసి, తప్పుడు ఓటర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈసీ కార్యాలయం ముందు దీక్ష చేపడతానని అన్నారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్‌ను నియమించడంపైనా ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ ప్రభావితం చేస్తోందని ఆరోపించారు. 2006లో భూసేకరణ వ్యతిరేక ఆందోళనల క్రమంలో చేపట్టిన 26 రోజుల నిరాహార దీక్షను ఆమె గుర్తుచేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు 215 చోట్ల విజయం సాధిస్తామని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీకి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తే విజయం సాధించలేమని తెలుసునని, అందుకే తప్పుడు జాబితాను రూపొందించే పనిలో పడిందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇక్కడ రావని, బయట వ్యక్తులు (బీజేపీ) బెంగాల్‌ను స్వాధీనం చేసుకోవడాన్ని తాము అనుమతించబోమన్నారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు హరియాణా, గుజరాత్ ఓటర్లను తమ రాష్ట్ర జాబితాలో చేర్చుతోందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఢిల్లీ, మహారాష్ట్రల్లోనూ బీజేపీ ఈ తరహా వ్యూహాలను అమలు చేసిందన్నారు.
Read Also: SLBC: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్న హరీశ్‌రావు.. రోడ్డుపైనే బైఠాయించిన నిరసన