IND vs AUS: ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ టీమిండియా- ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరుగుతోంది. సెమీఫైనల్స్, ఫైనల్స్‌లో 50కి పైగా పరుగులు చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఫైనల్లో కింగ్ కోహ్లి 56 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అంతకుముందు సెమీస్‌లో సెంచరీ సాధించాడు. కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత నరేంద్ర మోదీ స్టేడియం కోహ్లీ పేరుతో మార్మోగింది. రోహిత్ శర్మ ఔటైన తర్వాత భారత్ పరుగుల వేగం బాగా తగ్గింది. దాదాపు 14 ఓవర్ల పాటు బౌండరీ లేదు. హాఫ్ సెంచరీ సాధించిన కోహ్లీ కమ్మిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 30 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 4 వికెట్లకు 152 పరుగులు. కేఎల్ రాహుల్ 71 బంతుల్లో 39 ఆడుతున్నారు.
Also Read: Fan Hug Virat Kohli: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో కలకలం.. కోహ్లీని హగ్ చేసుకున్న అభిమాని.. వీడియో!
అంతకముందు తొలుత వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగింది. టీమిండియాకు తొలుత శుభారంభం అందించిన 30 పరుగుల వద్ద భారత్ జట్టు గిల్ రూపంలో మొదటి వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత దూకుడుగా ఆడుతున్న రోహిత్ 47 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. వెంటనే అయ్యర్ కూడా ఔట్ అయ్యాడు. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ పెవిలియన్ కు చేరాడు.
We’re now on WhatsApp. Click to Join.