Site icon HashtagU Telugu

CM KCR: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరణ

Logo

Logo

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో రాష్ట్ర సాధన నుంచి నేటిదాకా పదేండ్లకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా ప్రభుత్వం రూపొందించిన లోగోను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో ఆవిష్కరించారు.

దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ మోడల్ గా దేశ ప్రజలు ఆదరిస్తున్న రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్తు, వ్యవసాయం, మిషన్ భగీరథ, సాంస్కృతిక, యాదాద్రి వంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు, మెట్రో రైలు, టీ-హబ్, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం చిహ్నాలను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లోగోలో పొందుపరిచారు. వీటితోపాటు తెలంగాణ తల్లి, బతుకమ్మ, బోనాలు, పాలపిట్ట, అమరవీరుల స్మారకంతో కూడిన తెలంగాణ అస్తిత్వ చిహ్నాలతో తెలంగాణ ఖ్యాతి మరింత ఇనుమడించేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగో రూపుదిద్దుకుంది.

Also Read: 75 Years Reunite : అక్క మహేంద్ర కౌర్, తమ్ముడు అబ్దుల్ అజీజ్‌..75ఏళ్ళ తర్వాత కలిశారు